
అల వైకుంఠపురములో ముందుగా చెప్పినట్టే 12నే విడుదల అవుతుంది. ఒకరకంగా బన్నీ పంతం నెగ్గినట్టు అయ్యింది. అయితే 11న విడుదల కావడం వల్ల సరిలేరు నీకెవ్వరు కే అడ్వాంటేజ్ మొదటి రోజు దాదాపుగా అన్ని థియేటర్లలో వేసుకోవచ్చు. దీనితో మహేష్ బాబు కొంత తగ్గాల్సి వచ్చినా అది ఆయనకు మంచి చేసేదే.
వెంకీ మామ రిలీజ్ పై క్లారిటీ వచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఆ సినిమా గనుక సంక్రాంతి బరిలో నుండి తప్పుకుంటే ఈ రెండు సినిమాలకు కలిసి వచ్చేదే. ఇక అసలు విషయానికి వస్తే రెండు సినిమాలూ షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో పడ్డాయి. అల వైకుంఠపురంలో యూరోప్ లో, సరిలేరు నీకెవ్వరు కేరళ షూటింగ్ జరుపుకుంటున్నాయి.
అల వైకుంఠపురంలో సినిమాను త్రివిక్రమ్, సరిలేరు నీకెవ్వరు ను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. మరోవైపు గతంలో బన్నీకి రెండు పెద్ద హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ ఈ సారి హాట్ట్రిక్ పూర్తి చెయ్యాలనుకుంటున్నాడు.
ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త భయానక వాతావరణం మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో కనిపిస్తోంది. ఇంతవరకు జరిగిన, ఇంకా…
The deputy CM of Andhra Pradesh, Pawan Kalyan has another facet and it is regarding…