
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పాట విడుదల చెయ్యడం అనేది మంచి ఆలోచన. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటిదాకా చిన్న హీరోల తో పని చేసిన ఆమె ఈ చిత్రంతో పై స్థాయికి వెళ్లబోతుంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
సంక్రాంతి రిలీజ్ అంటున్నారు కాబట్టి ఎక్కడా బ్రేక్ లేకుండా షూట్ చెయ్యాల్సి ఉంది. పక్కా కమర్షియల్ అంశాలు మేళవించిన సినిమాగా….మంచి యాక్షన్ సినిమాగా ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలుకాక ముందే అమెజాన్ ప్రైమ్ సినిమా డిజిటల్ రైట్స్ ను, జెమినీ టీవీ టీవీ ప్రసారహక్కులను కొనుగోలు చేసింది. సంక్రాంతి బరిలో ఈ చిత్రం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా అల… వైకుంటపురములో.. సినిమాతో పోటీ పడబోతుంది.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…