
కానీ అది సరైన కారణం కాదని మనకున్న సమాచారం. “ఈ చిత్రం ఇప్పటివరకు 15 రోజులు మాత్రమే చిత్రీకరించబడింది. ఆ దుబాయ్ లో జరిగిన షెడ్యూల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ మరియు రెండు సీన్లు షూట్ చేయబడ్డాయి. టీజర్ కట్ చేయడానికి ఫుటేజ్ సరిపోదని బృందం భావిస్తుంది అందుకే వారు వెనక్కి తగ్గారు” అని అంటున్నారు.
అయితే మహేష్ బాబు అనుకుంటే ఆ ఫైట్ లోని ఒక షాట్ నైనా తీసుకుని ఒక చిన్న వీడియో ని విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. లేదంటే దుబాయ్ షెడ్యూల్ లోని ఒక ఫోటో తో పోస్టర్ దింపి సరిపెట్టవచ్చు. ఈ చిత్రం సంక్రాంతి 2022 కోసం ఇప్పటికే ప్రకటించబడింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.
ఈ చిత్రం తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో #SSMB28 సినిమా చెయ్యబోతున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. ఈ రెండు సినిమాల తరువాత రాజమౌళి సినిమా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సినిమా ఇంకా ఆలస్యమైతే ఆ గ్యాప్ లో అనిల్ రావిపూడి తో సినిమా ఉండే అవకాశం ఉంది.s
Prakriti Pavani turns up the festive voltage in this striking red lehenga set that blends…
Advance bookings for Bollywood's magnum opus Ramayana were set to open today (October 20) at…