Telugu

‘దట్స్ ది బ్యూటీ’ ఆఫ్ మహేష్ బాబు!

ఎంత ఎదిగినా ఒదిగి ఉండడంలో ప్రిన్స్ మహేష్ బాబు దిట్ట అని, ఆయనతో తాజాగా పని చేసిన కైరా అద్వానీ చెప్పిన విషయం తెలిసిందే. ఆ మాటకొస్తే… ఒక్క కైరా అద్వానీ ఏమిటి, గతంలో చాలామంది ప్రముఖులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒక్క వ్యవహారశైలి విషయంలోనే కాదు, మాటల్లో కూడా మహేష్ బాబు వ్యక్తిత్వం ప్రతిబింబిస్తూ ఉంటుంది. సూటిగా సూత్తి లేకుండా, ఎలాంటి మొహమాటాలకు తావు లేకుండా తనదైన శైలిలో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో మహేష్ బాబుకు ఓ ప్రత్యేకత ఉంది.

ADVERTISEMENT

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో… “ఈ సినిమాలో సిఎంగా మహేష్ బాబును తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నాం” అని అంటుంటే… మీకు ఎలా ఉంటుంది? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు… “ఒక్క నా సినిమాకే అని కాదు, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అయిన ఏ సినిమాకైనా ఇలాంటి అనుభూతే కలుగుతుంది” అని మహేష్ చెప్తున్న సమయంలో, యాంకర్ ఇంకేదో చెప్పాలని ప్రయత్నించినప్పటికీ, ‘కాదు, ఇది నిజం, అందరికీ అలానే అనిపిస్తుంది, ఆ బ్లాక్ బస్టర్ ప్రభావం అలా ఉంటుంది, ఆ కళ్ళతో చూసిన తర్వాత వేరొకరిని ఊహించుకోలేం’ అంటూ బదులిచ్చారు.

హీరోలను ఆకాశంలోకి ఎత్తే భాగంలో సాధారణంగా యాంకర్లు ఇలాంటి రొటీన్ ప్రశ్నలు వేస్తుంటారు. గతంలో చాలా మంది హీరోలకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే మహేష్ లా ఎవరూ ఇంత సూటిగా చెప్పలేదు. నిజానికి మహేష్ లో ఉన్న గొప్పతనం కూడా అదే. సక్సెస్ వచ్చిందని ఏదొకటి మాట్లాడడం మహేష్ కు అలవాటు లేని పని. కెరీర్ తొలినాళ్ళ నుండి అనుసరిస్తోన్న విధానమే ఇది. అయితే తాను పెరుగుతున్న కొద్ది తన ఆలోచనల్లో కూడా మార్పు వస్తోందని చెప్పడానికి నిదర్శనమే తాజా సమాధానం. నిజంగా ఆడియన్స్ ఏదయితే ఫీల్ అవుతున్నారో, సరిగ్గా దానినే తన మాటల్లో వ్యక్తపరిచారు ప్రిన్స్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వివాహాలు, విడాకులు.. రెండూ వేగంగానే?

ఒకప్పుడు పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం కూడా. ఆర్థిక ఇబ్బందులు,…

6 minutes ago

బాబు పై కేటీఆర్ పొగడ్తలు….వైసీపీ కి అర్ధమవుతుందా.?

సీఎం గా చంద్రబాబు నాయుడు ఫెయిల్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతులకు సాగు నీటి నుంచి ప్రజలకు…

9 minutes ago