
అయితే వినూత్నమైన రీతిలో చేసిన “1 నేనొక్కడినే” సినిమా ప్రమోషన్స్ యావత్తు సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలను ఏర్పాటు చేసింది. చివరికి ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో దారుణ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం నటిస్తోన్న ప్రిన్స్ “స్పైడర్” ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. ‘1’ సినిమా మాదిరే ఊరించి ఊరించి ‘ఫస్ట్ లుక్’ను విడుదల చేయగా, యూ ట్యూబ్ లో ఎన్నడూ లేని విధంగా యాడ్ విభాగంలో ‘స్పైడర్’ ప్రోమో సందడి చేస్తూ సరికొత్త ప్రమోషన్ కు శ్రీకారం చుట్టారు.
అలాగే ‘1’ సినిమా మాదిరే ఇందులోనూ ప్రిన్స్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తుండగా, తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని స్టిల్స్ నాటి ‘నేనొక్కడినే’ సినిమాను తలపిస్తున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా జూన్ 23వ తేదీన విడుదల కానుండగా, టాక్ లో కాస్త అటు ఇటు అయితే, ‘1 నేనొక్కడినే’ మాదిరే ఒక వర్గానికే పరిమితం కావడం ఖాయమని చెప్పవచ్చు. అందుకే స్టిల్స్ బేస్ కంటే కూడా కాన్సెప్ట్ బేస్ తో ప్రమోషన్స్ ఇచ్చుకుంటే, ప్రేక్షకులకు కనెక్టవిటీ ఎక్కువగా ఉంటుంది.
Rohit Sharma’s future with Team India has once again become a major talking point as…
Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…