
మొత్తం నాలుగు పాటలు మరియు ఓ థీమ్ మ్యూజిక్ ఉన్న ఈ ఆల్బమ్ లో… బూమ్ బూమ్, హాలి హాలి పాటలను ప్రేక్షకులు ఇప్పటికే విని తీర్పు కూడా ఇచ్చేసారు. ఇక మిగిలిన రెండు పాటలలో ‘సిస్లియా… సిస్లియా… చిరు చిరు గాలికి…’ అన్న పాట ఆకట్టుకునే విధంగా ఉంటుంది. నిజానికి ఆ ఆల్బమ్ లో ఇదే హైలైట్ సాంగ్ అని చెప్పవచ్చు. ఈ పాటనే చివరగా రుమేనియాలో చిత్రీకరించారు. ఇందులో కూడా అక్కడక్కడ తమిళ వాసన కనపడుతుంది గానీ, మిగిలిన పాటలతో పోలిస్తే కాస్త వినసొంపుగా ఉంటుంది.
ఇక, ఈ ఆల్బమ్ లో మెలోడిగా ‘అచ్చం తెలుగందం’ అనే పాట నిలిచింది. ‘తెలుగందం’ అనేది లిరిక్స్ లోనే ఉంటుంది గానీ, పాటంతా వెస్ట్రన్ స్టైల్లో సాగుతుంది. మెలోడీ ప్రియులను ఆకట్టుకునే పాటగా దీనిని పేర్కొనవచ్చు. రెండవ టీజర్ లో రకుల్ ‘బ్లైండ్ డేట్’ కావాలని అడిగిన సందర్భంలో ఈ పాట వస్తుందన్న విషయం, పాట వినగానే తెలిసిపోతుంది. చివరగా… ‘స్పైడర్’ తొలి టీజర్ లో అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను థీమ్ మ్యూజిక్ గా యాడ్ చేసి ఈ ఆల్బమ్ ను విడుదల చేసారు గానీ, ఇందులో ఉన్నవి కేవలం నాలుగు పాటలే.
ఈ నాలుగింటిలో వినగానే ఎక్కే పాటలైతే ఏమీ లేవు. ఉన్నంతలో ‘సిస్లియా’ పాట పర్వాలేదనిపిస్తుంది, అలాగే ఇప్పటికే విని విని ఉన్న ‘బూమ్ బూమ్’ సంగీతం ఆకట్టుకుంటుంది. ఆడియో పరంగా పెద్దగా ఆకట్టుకోని ఈ ఆల్బమ్, విజువల్ గా అద్భుతంగా తెరకెక్కిందన్న విషయమైతే స్పష్టం. ఆ గ్రాండ్ లుక్ లో ఏమైనా ఈ పాటలు అద్భుతంగా ఉంటాయేమో సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాలి. ఇక ప్రిన్స్ అభిమానుల ఆశలన్నీ ఒక్క ధియేటిరికల్ ట్రైలర్ పైనే పెట్టుకున్నారని చెప్పడంలో సందేహం లేదు.
Pawan Kalyan’s birthday celebrations are getting another update from the team of OG. Director Sujeeth…
Toxic is slowing down at the box office, and Tuesday’s numbers have added to the…