
మే 10వ తేదీకల్లా షూటింగ్ మొత్తం పూర్తి కానుందని, ఆ తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించి, మే 23కల్లా “స్పైడర్”ను సిద్ధం చేస్తున్నారనేది లేటెస్ట్ న్యూస్. అయితే ఇక్కడ స్పష్టత రావాల్సిన ఒక విషయం ఏమిటంటే… తెలుగు, తమిళ భాషల్లో జూన్ 23వ తేదీన విడుదల కావడం నూటికి నూరు శాతం పక్కా అయినప్పటికీ, హిందీ, మలయాళ భాషలలో అదే తేదీన విడుదల కానుందా? లేక ఓ రెండు వారాల పాటు బ్రేక్ పడుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
హిందీలో జూన్ 23నే సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్ లైట్’ సినిమా విడుదల కానుండడంతో, బాలీవుడ్ లో ధియేటర్ల కొరతతో పాటు, ‘స్పైడర్’ను నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి తగినంత సమయం కూడా దొరకకపోవచ్చని చిత్ర యూనిట్ వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో జూన్ 23న హిందీ, మలయాళ భాషలకు సంబంధించి ఖరారు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలలో డూప్ లేకుండా పాల్గొన్న ప్రిన్స్, అవాక్కయ్యేలా స్టంట్స్ చేసారని లభించిన మరో కీలక సమాచారం. దీంతో ప్రిన్స్ ప్రభంజనానికి జూన్ 23వ తేదీకి ఫ్యాన్స్ రెడీ కావడమే తరువాయి అన్నది పక్కా న్యూస్.
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…