
అయితే ఆ కొత్తదనమే తాజా “స్పైడర్”లో లోపించినట్లుగా కనపడుతోంది. బయో టెర్రరిజం నేపధ్యంలో ఓ రొటీన్ రివేంజ్ స్టోరీకి విజువల్ గా కాస్త హంగామాలు చేసి ప్రేక్షకుల పైకి వదిలేందుకు సిద్ధమవుతున్నట్లుగా తాజాగా విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ చెప్తోంది. ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు గానీ, ట్రైలర్ ముగిసిన తర్వాత గానీ “స్పైడర్” సినిమా చూడాలన్న ఆసక్తి, కనీసం అభిమానులకు కూడా కలగడం లేదని చెప్పడంలో సందేహం లేదు. అంత అద్భుతంగా ట్రైలర్ ను కట్ చేసారు “తమిళ” దర్శకుడు మురుగదాస్ వర్యులు!
అది కూడా తొలుత లీకేజ్ ద్వారా విడుదల కావడం మరింత విస్తుగొలిపే విషయం. షూటింగ్ ఆద్యంతం లీకేజ్ విషయంలో జాగ్రత్తలు వహించిన “స్పైడర్” యూనిట్, పోస్ట్ ప్రొడక్షన్ లో ఆ జాగ్రత్తలు మిస్ కావడం, రేపు సినిమా కూడా ముందుగా ఆన్ లైన్ లో వస్తుందా? అన్న సందేహాలను ప్రేక్షకులకు కలిగిస్తోంది. ఈ లీకేజ్ వలన నేడు విడుదల కావాల్సిన ట్రైలర్ ను, గురువారం అర్ధరాత్రి సమయంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసారు. అంతా చూసిన తర్వాత ఇందులో 125 కోట్ల ఖర్చు ఎక్కడుంది? అంటే ఆ “బండరాయి”ని చూస్తూ నోరెళ్ళబెట్టాల్సిందే!
బహుశా సిల్వర్ స్క్రీన్ పై ఆ ఖర్చుకు సరిపడ విజువల్స్ ను చూపిస్తారేమో గానీ, ప్రేక్షకులను కధలో ఇన్ వాల్వ్ చేయకుండా, విజువల్ గా ఎన్ని వండర్స్ సృష్టించినా దాని ఫలితం శూన్యం. సరిగ్గా “స్పైడర్” విషయంలో ఇలాంటి “డేంజర్” సిగ్నల్స్ ఒక దానిని మించి మరొకటి రెట్టింపవుతూ వస్తున్నాయి. చివరగా విడుదలైన “అక్కడ ఉన్నాడు” అనే కర్ణకఠోరమైన పాట నుండి తేరుకోకముందే, ట్రైలర్ విడుదలై ఆ పాటను పక్కకు తోసింది. ఇప్పటివరకు “స్పైడర్”కు సంబంధించి పాజిటివ్ విషయం ఏమైనా ఉంది అంటే… అది “ష్….” అంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ మాత్రమే..!
హీరోలకు, దర్శకులకు జయాపజయాలు సర్వసాధారణమే. అయితే మహేష్ విషయానికి వచ్చేపాటికి ఇది కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. సినిమా కధ ఎలా ఉన్నా, దానిని డామినేట్ చేసే విధంగా, తన అభినయాన్ని ప్రదర్శించడం ప్రిన్స్ స్పెషాలిటీ. దారుణ పరాజయాలు చవిచూసిన “ఖలేజా, ఆగడు, 1 నేనొక్కడినే” వంటి సినిమాలలో ప్రిన్స్ తనలోని మరో యాంగిల్ ను ప్రేక్షకులకు రుచిచూపించి, విమర్శకుల చేత ప్రశంసలు పొందారు. కానీ “స్పైడర్” విషయంలో ఆ ఆసక్తి కూడా అభిమానులకు లేకపోవడం అత్యంత నిరాశ చెందే అంశంగా మారింది.
ఫైనల్ గా… విడుదలైన టీజర్, ట్రైలర్ లో కాకుండా సిల్వర్ స్క్రీన్ పైన ఏమైనా అద్భుతాలు చూపిస్తారని వేచిచూడడం తప్ప, అభిమానులు అంతకు మించి చేయగలిగిందేమీ లేదు.
What happens when a Gujarati film made for around Rs 50 lakh turns into a…
Kichcha Sudeepa’s birthday celebrations get a high-octane touch with the arrival of an action-packed first…