
మహేష్ బాబు 28 టైటిల్ కు సంబంధించిన చర్చలు సోషల్ మీడియాలో బోర్డర్ దాటేసి ఉన్న ఆసక్తిని కూడా చంపేసే దిశగా తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే వాయిదాలు, క్యాన్సిళ్ళు, స్క్రిప్ట్ పట్ల అసంతృప్తులు లాంటివి బోలెడు జరిగాయి. ఫ్యాన్స్ లోనే ఈ పరిణామాలు లేనిపోని సందేహాలు లేవనెత్తాయి. అలాంటప్పుడు ఏదైనా మంచి ఊపిచ్చే పోస్టర్ నో టీజర్ నో వదిలి హైప్ ని అమాంతం పెంచేలా చేయాలి కానీ ఏదో దేశభదత్రకు సంబంధించిన ఇష్యూ లాగా టైటిల్ గురించి ఇంత డిస్కషన్ తేకూడదు. క్రమంగా ఇదేదో చిన్నపిల్లలాట అనిపిస్తోందంటే ఆ తప్పు ఎవరిది.
నిజానికి ఈ కాంబో మీద మంచి అంచనాలున్నాయి. వాటిని క్యాష్ చేసుకునే విధంగా కంటెంట్ మీద దృష్టి పెట్టాలి. పాటలు ఎప్పుడు ఎలా వదలాలి, తమన్ ని వాడుకుని ఎలాంటి బజ్ తీసుకురావొచ్చు లాంటివి బోలెడు ప్లాన్ చేసుకోవచ్చు. అవన్నీ వదిలేసి పదే పదే టైటిల్ మీద ట్విట్టర్ లో వందలాది మీమ్స్, ట్వీట్లు వచ్చేలా చేయడంలో త్రివిక్రమ్ బృందం ఊహిస్తున్న పరమార్థం ఏమిటో కానీ అసలు పదార్థం మీద ఇంటరెస్ట్ తగ్గిపోయే ప్రమాదాన్ని తెచ్చి పెడుతోంది. కేవలం టైటిల్ తోనే పది ఇరవై కోట్ల బిజినెస్ పెరగదు కదా.
ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు సంబంధించిన లీకులను సదరు టీమ్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తోంది. ఒక్క దేవర పేరు మాత్రమే బయటికి వచ్చింది. అది నిజమైనా కాకపోయినా అఫీషియల్ గా వచ్చేది ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ గా ఉంటుంది. కానీ మహేష్ 28కి అమరావతి నుంచి గుంటూరు కారం దాకా ఏవేవో ప్రచారంలోకి తేవడం సగటు ప్రేక్షకుడికి ఏంటి గోల అనిపించే రిస్క్ ఉంది. అసలు టైటిల్ ఏదైనా యునానిమస్ గా ఆహా ఓహో అనిపించుకోదు. ఆర్ఆర్ఆర్ టైంలో అది ఎంత మందికి అర్థమయ్యింది. ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా చేరిపోయింది. గుడి లేని చోట ప్రదక్షిణాలు చేస్తే ఎలా అయితే పుణ్యం దక్కదో అవసరానికి మించి ఇలా టైటిల్ చుట్టూ క్యాంపైన్ నడిపిస్తే ప్రయోజనమూ కలగదు.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…