
తెలుగు ఇండస్ట్రీ లో అసలు సిసలైన క్లాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. ఆయనను వర్జినల్ మాస్ లుక్ లో చూడాలని ఎంతోకాలంగా ఆశపడుతున్న మహేష్ మాస్ అభిమానులకు ఈ రోజు కన్నుల పండుగ గా మాస్ ట్రీట్ ఇచ్చారు గుంటూరు కారం చిత్ర యూనిట్.
గళ్ళ లుంగీ, చేతిలో బీడీ పట్టుకుని “ఏంటి బీడీ త్రీడీలో కనపడిందా”..అంటూ మహేష్ చెప్పే ఊరమాస్ డైలాగ్ తో మాస్ ప్రేక్షకులను పలకిరించడానికి ఈ సంక్రాంతికి థియేటర్లకు రాబోతున్నారు మహేష్ అనేది త్రివిక్రమ్ గుంటూరు కారం మొదటి లుక్ తోనే కన్ఫార్మ్ చేశారు.
సినిమా యూనిట్ నుండి బయటకు వచ్చిన మహేష్ ప్రతి లుక్ అటు మహేష్ ను కొత్త కోణంలో చూడాలి అని ఆశపడిన మహేష్ అభిమానులకు ఉత్సాహాన్ని కలిగించిందనే చెప్పాలి. నిన్న విడుదలైన “కుర్చీ మడత పెట్టి” సాంగ్ ప్రోమో పై సోషల్ మీడియాలో రచ్చ మొదలైయ్యింది. మహేష్ లాంటి క్లాస్ హీరోతో ఇలా కుర్చీ మడత పెట్టి అనే మాస్ పాటను చిత్రీకరించడం అంటే త్రివిక్రమ్ చాల పెద్ద సాహసమే చేశారని చెప్పాలి.
తాజాగా విడుదలైన ఈ మాస్ సాంగ్ లో “నాట్యకారి” శ్రీలీల గ్రెస్ కు ఏమాత్రం తగ్గకుండా మహేష్ వేసిన స్టెప్పులు మహేష్ అభిమానులకు కన్నుల పండుగా ఉన్నాయి. ప్రమోషన్లలో కాస్త వెనుకబడ్డారు అనే అభిమానుల నిరుత్సహన్ని చిత్ర బృందం ఈ ఒక్క పాట విడుదలతో తుడిచిపెట్టేసింది. ఇప్పుడు బుల్లితెర మీద చూసిన ఈ పాటను రేపు వెండి తెర మీద చూస్తుంటే మాత్రం “ఏ ఒక్కరు కుర్చీలో కూర్చునేలా లేరు” అంటున్నారు మహేష్ ఫాన్స్.
రామజోగయ్య గారి సాహిత్యానికి తమన్ అందించిన మ్యూజిక్ కు శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచింది. అతడు, ఖలేజా సినిమాలతో మహేష్ లో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన త్రివిక్రమ్ తమ హ్యాట్రిక్ కాబో కు అదిరిపోయే హిట్ ఇవ్వడానికి హారిక అండ్ హాసిని క్రియేషన్ తో కలిసి జనవరి 12 న సంకాంత్రి కానుకగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో మేయర్, మున్సిపల్ చైర్మన్, చైర్ పర్సన్ సీట్ల కోసం కూటమిలో మూడు పార్టీలు పట్లు పట్టాల్సిరావడం…
With local body elections approaching in Andhra Pradesh, the YSR Congress Party (YSRCP) has filed…