
“ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ గురించి మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు, నిజానికి దాని కోసం చిత్ర యూనిట్ మొత్తం డే అండ్ నైట్ పని చేస్తోంది. అతి త్వరలోనే ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తాము, అయితే అప్పటివరకు కాస్తంత సహనంతో ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాను, ఎప్పటిలాగానే మీ పై ప్రేమ చూపించే…” అంటూ ట్విట్టర్ వేదికగా ప్రిన్స్ ఓ అధికారిక సమాచారం వెల్లడించారు.
దీంతో ‘ఫస్ట్ లుక్’ రాలేదన్న బాధను మరిచిపోయి, ప్రిన్స్ ట్వీట్ చేసారన్న ఆనందంలో అభిమానులు మునిగి తేలుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా తేదీని ప్రకటించకపోవడంతో, ఫస్ట్ లుక్ విడుదలపై చిత్ర యూనిట్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదన్న విషయం ఖరారైంది. అయితే ‘అతి త్వరలోనే’ మీకు ఇస్తాను అన్న ప్రిన్స్ మాటలు మాత్రం ఫ్యాన్స్ కు తీపికబురుగా మారిపోయాయి.
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…