
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు, పదోన్నతులకు సంబంధించిన జీవో నెంబరు 64ను ఏపీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను రద్దు చేయాలని అంతకు రెండు రోజుల ముందే ట్విట్టర్ వేదికగా ఏపీ సర్కార్ ను పవన్ కళ్యాణ్ కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై వ్యవసాయ పట్టభద్రుల సంఘం ‘జనసేన’ అధినేతపై మండిపడుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగింది.
“పవన్ తమ జీవితాలతో ఆడుకున్నాడని” ఆవేదన వ్యక్తం చేయగా, ఈ వార్తను న్యూస్ పేపర్ లో చూసిన మహేశ్ కత్తి… హాఫ్ నాలెడ్జ్ ఎల్లప్పుడూ ప్రమాదమేనని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ కు ఎవరు సలహా ఇచ్చారో తనకు తెలియట్లేదని మహేశ్ కత్తి ఎద్దేవా చేశాడు. పవన్ కళ్యాణ్ ను నిలదీయడానికి వచ్చిన ఏ చిన్న సందర్భం కూడా మహేష్ కత్తి వదులుకోవడం లేదని ఈ సందర్భంగా నిరూపణ అవుతోంది.
Pawan Kalyan’s birthday celebrations are getting another update from the team of OG. Director Sujeeth…
Toxic is slowing down at the box office, and Tuesday’s numbers have added to the…