Telugu

హీరోయిన్ – పడకగది… మరో స్టోరీ..!

సినిమాల్లో అవకాశాల పేరుతో పలువురు హీరోలు, దర్శకులు తనను పడకగదికి రమ్మన్నారని కోలీవుడ్ నటి, మలయాళీ భామ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని, పడకగదికి రమ్మనే చేదు అనుభవాన్ని తానూ ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు, దర్శకులు పలుమార్లు తనను బెడ్రూంకు రమ్మన్నారని, అయితే ఇక్కడ ఇదంతా సహజమేనని, చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చారని పేర్కొంది. తాను తక్కువ సినిమాలు చేయడానికి కారణం కూడా ఇదేనని, అలాంటి అవకాశాలు తనకు వద్దని తేల్చి చెప్పింది. ఈ కారణంగానే తాను చాలా కాలం ఇంట్లో ఖాళీగా కూర్చున్నానని చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT

‘పూ’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన పార్వతి చేసింది తక్కువ సినిమాలే అయినా, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, తమకూ ఇటువంటి చేదు అనుభవాలు ఎదురైనట్టు నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్, సంధ్య, కస్తూరి తదితర హీరోయిన్లు బహిరంగంగానే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితా అంతకంతకూ పెరుగుతూ పోతుండడం, హీరోయిన్లుగా రావాలనుకుంటున్నవారికి భయబ్రాంతులకు గురిచేసే అంశం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇంత అయోమయం దేనికి రాజా?

రాహుల్‌ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…

6 minutes ago

Breaking: Revanth Removes Konda Surekha From Cabinet!

Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…

39 minutes ago