
ప్రస్తుతం పరారీలో ఉన్న మల్లాది విష్ణు గురించిన విషయాలు వాట్సప్ లో హల్చల్ చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఉన్నారని కొందరు అంటుంటే, మరికొందరు షిర్డీలో ప్రత్యక్షం అయ్యారు, ఇవిగో ఫోటోలు అంటూ మల్లాది విష్ణుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సందడి చేస్తున్నాయి. అలాగే ప్రముఖ చానెల్ కూడా మల్లాది విష్ణు షిర్డీలో ఉన్నారంటూ కధనాలు ప్రసారం చేయడం ఈ సమాచారానికి మరింత బలాన్ని సమకూరుస్తోంది. మరి పోలీసులు ఎప్పటికి మల్లాది విష్ణు సమాచారం తెలుసుకుంటారో చూడాలి.
కేసు వెలుగు చూసిన తర్వాత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి, ఆ బార్ తనకు సంబంధించి కాదని, తన కుటుంబ సభ్యులదని, అసలు కల్తీ మద్యం జరగలేదని ఖండించిన మల్లాది విష్ణు, మరికొద్ది రోజులకే మాయం అయ్యారు. మరోవైపు మల్లాది సోదరుడు నేరాన్ని అంగీకరిస్తూ లొంగిపోయారు. ఆ సమయంలో విజయవాడ వేదికగానే ‘కాల్ మనీ’ వెలుగు చూడడంతో కల్తీ మద్యం విచారణ నత్తనడకన కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కుప్పం మండలం నడిమూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మాజీ సైనికుడు వి. చక్రపాణి రెడ్డి ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేసినట్లు…
Today, Malayalam actor Mammootty is celebrating his 75th birthday and as a birthday special for…