
పారిస్ లోని గత శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మల్లిక తన ప్రియుడు సిరిల్ తో కలిసి అపార్టు మెంట్ కు వచ్చింది. అదే సమయంలో మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వారిపై టియర్ గ్యాస్ స్ప్రే చేసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మల్లికా షెరావత్ ను పిడి గుద్దులు గుద్దినట్లుగా సమాచారం. అనంతరం మల్లిక తన స్నేహితులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో వారు అక్కడికి వచ్చారు.
మల్లిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. కాగా, హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియాన్ ఫ్లాట్ పక్కనే మల్లిక ఫ్లాట్ కూడా ఉంటుంది. గతంలో కర్దాషియన్ ఫ్లాట్ కు వచ్చిన దుండగులు ఆమెను తుపాకీతో బెదిరించి డబ్బు, నగదు దోచుకు వెళ్లిన సంఘటన విదితమే. దీంతో వరుసగా సదరు అపార్ట్ మెంట్ లో నమోదవుతున్న ఈ దాడులు సెలబ్రిటీలకు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది.
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…