
ఈ నెల 25న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్ ఇంటర్వ్యూ లో భాగంగా అల్లరి నరేశ్ “మామ మంచు – అల్లుడు కంచు” సీక్రెట్ ను బయటపెట్టారు. ‘అల్లరిమొగుడు’ సినిమా క్లైమాక్స్ పిల్లలు పుట్టడంతో ముగుస్తుంది, అక్కడ్నుంచి కధ మొదలైతే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ సినిమా కధనం సాగుతుందని, అయితే చిత్ర మూలకధ మాత్రం ఓ మరాఠీ సినిమాకు రీమేక్ అని ధృవీకరించారు.
తన కెరీర్ లో 50వ సినిమాగా విడుదల కాబోతున్న “మామ మంచు – అల్లుడు కంచు” సినిమాలో మోహన్ బాబు – తన కాంభినేషన్లో వచ్చే సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయని, శ్రీనివాస్ రెడ్డి కామెడీ టైమింగ్ తో ఈ సినిమా ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని అల్లరి నరేష్ అభిప్రాయపడ్డారు. మరి ఈ ‘అల్లరోడు’ నమ్మకం ఎంతవరకు నెరవేరుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాలి.
కుప్పం మండలం నడిమూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మాజీ సైనికుడు వి. చక్రపాణి రెడ్డి ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేసినట్లు…
Today, Malayalam actor Mammootty is celebrating his 75th birthday and as a birthday special for…