Telugu

ఆ హీరోయిన్ ను వేధించిన వ్యక్తి అరెస్ట్!

Zaira-Wasimఅమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘దంగల్’ చిత్ర నటి జైరా వాసిమ్, విస్తారా విమానంలో ప్రయాణిస్తున్న వేళ, ఆమెను వేధించిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అతను 39 సంవత్సరాల ముంబై వ్యాపారవేత్త వికాస్ సచ్ దేవ్ అని, బాధితురాలి వయసు 17 సంవత్సరాలే కావడంతో, పోస్కో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) సహా పలు సెక్షన్లపై కేసు పెట్టినట్టు న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుంభారే వెల్లడించారు. వేధింపులకు పాల్పడ్డ సదరు వ్యక్తిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.

ADVERTISEMENT

కాగా, విమానంలో తన సీటు హ్యాండ్ రెస్ట్ పై వెనక కూర్చున్న వ్యక్తి కాలు పెట్టాడని, మెడ, చేతులు, వీపుపై అసభ్యంగా తాకాడని జైరా వాసిమ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఏడుస్తూ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. విషయాన్ని ఫ్లయిట్ క్రూ దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని ఆరోపించింది. జరిగిన ఘటనపై విస్తారా సైతం స్పందించింది. ఈ తరహా సంఘటనలను తాము ప్రోత్సహించబోమని, విచారణలో జైరాకు పూర్తి సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Haiwaan Public Talk: Akshay Kumar’s Film Dead on Arrival?

Haiwaan arrived in theatres after a long wait. Expectations were sky-high for a lot of…

11 minutes ago

ప్రతిపక్షాలకు మాత్రమే: గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత…ఓడితే ప్రభుత్వ దౌర్జన్యం…

స్థానిక ఎన్నికల సమరానికి పార్టీ క్యాడర్, లీడర్ లకు కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యాల్సిందే అంటూ తేల్చి చెప్పిన…

38 minutes ago