
ఇది ఇలా ఉండగా నిన్న తన భార్య ప్రసవాన్ని ఇంస్టాగ్రామ్ లో లైవ్ ఇవ్వబోతున్నట్టు విష్ణు ప్రకటించారు. ఈ ఐడియా కాజల్ అగర్వాల్ ఇక ఇచ్చిందని, దానికి ఆమెకు ధన్యవాదాలని ఆయన ప్రకటించారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొందరైతే ఈ ఐడియాను తిట్టారు కూడా… కొందరు మీ సినిమాల్లాగే ఈ ఐడియా కూడా ఉంది అంటూ సెటైర్లు విసిరారు. అయితే దీని మీద విష్ణు భార్య సీరియస్ అయ్యారు. అలా చేస్తే నిన్ను తన్నడం ఖాయమంటూ సుతిమెత్తగా హెచ్చరించారు.
విరానికా హింసాత్మక హెచ్చరికకు మోహన్ బాబు సపోర్టు కూడా ఉండటంతో ఈ ప్రతిపాదన విరమించుకుంటున్నా అని విష్ణు ప్రకటించారు. దీనితో ఈ వివాదానికి తెర పడింది. ఇది ఇలా ఉండగా 2018లో వచ్చిన ఆచారి అమెరికా యాత్ర తరువాత విష్ణు తన తదుపరి చిత్రం ఏదీ మొదలు పెట్టలేదు. ఎప్పటి నుండో రిలీజ్ కు నోచుకోని ఓటర్ సినిమా విడుదలై అట్టర్ ప్లాప్ అయ్యింది. మరి శ్రావణ శుక్రవారం రోజు పుట్టిన ఈ మహాలక్ష్మి విష్ణు భాగ్యరేఖలను మారుస్తుందేమో చూడాలి.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…