
సినీఇండస్ట్రీలో ఉన్నపెద్ద కుటుంబాలలో మంచు ఫ్యామిలీ కూడా ఒకటని చెప్పాలి. మోహన్ బాబు సినీ వారసత్వాన్ని అందుకుని సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు మంచు విష్ణు, మనోజ్,లక్ష్మి. అయితే ఈ కుటుంబం తమ విజయాలతో కన్నా తమ వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
చిన్న కుమారుడు మనోజ్ మినహాయిస్తే, తండ్రి మోహన్ బాబు, పెద్ద కుమారుడు విష్ణు, కుమార్తె లక్ష్మి ఈ ముగ్గురు వారి మాటతీరుతోనో, ప్రవర్తనతోనో ఎప్పుడు ఏదోఒక వివాదంలో నిలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటారు.
గత ‘మా’ ఎలెక్షన్స్ సమయంలో ఈ ఫ్యామిలీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. బావ కళ్ళల్లో ఆనందం కోసం తమకు బంగారు జీవితాన్నిఇచ్చిన సినీ ఇండస్ట్రీ పరువుని బజారున పడేయడానికి కూడా ఏమాత్రం సంశయించలేదు ఈ పెద్దమనుషులు.
ఎన్నాళ్ళ కలగానో మిగిలిపోయిన ‘మా’ భవనాన్ని నా సొంత డబ్బుతో కట్టించి సినీ ఇండస్ట్రీ ఋణం తీర్చుకుంటాను అంటూ హామీ ఇచ్చి ప్రకాష్ రాజ్ ప్యానల్ మీద గణ విజయం సాధించి మా అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారు మంచు విష్ణు.
ఎదో ఒక దేశానికో, లేక రాష్ట్రానికో జరుగుతున్న అధ్యక్ష్య ఎన్నికల మాదిరి మా ఎన్నికల ప్రచారం సాగింది. హద్దులు దాటిన విమర్శలతో ప్రజలలో ఏసడింపు కలిగేంత స్థాయిలో, రాజకీయ నాయకులను తలతన్నేఅంతలా వ్యక్తిగత విమర్శలతో చెలరేగిపోయారు సినీతారలు.
ఏకంగా మంచు మోహనబాబు తన కుమారుడి ప్రత్యర్థిగా పోటీకి దిగిన మరో ప్యానల్ సభ్యుల పై చెయ్యి చేసుకునేంత స్థాయిలో ఎన్నికల వాతవరణం మారిపోయింది అంటేనే అర్ధమవుతుంది గత మా ఎన్నికలు ఏ స్థాయికి వెళ్లి పోయాయి అనేది. ప్రతి మా ఎన్నికల సందర్భంలోను పోటీకి దిగిన రెండు ప్యానల్ సభ్యులు ఇచ్చే ఉమ్మడి హామీ మా భవనం నిర్మాణం.
ఈసారి మాకు మద్దతుగా నిలబడండి, మా ప్యానల్ సభ్యులను గెలిపించండి మా భవనాన్ని మేము నిర్మించి చూపిస్తాం అంటూ హామీ ఇవ్వడం, మళ్ళీ అదే హామీతో తరువాతి ఎన్నికలకు రెడీ అవ్వడం మా ఎన్నికలలో సర్వసాధారణమయ్యిపొయింది. నేను ఒక్క ఫోన్ చేస్తే ఇళయరాజా వస్తాడు, ఒక్క మెసేజ్ చేస్తే రెహమాన్ వస్తాడు..,ఇటువంటి లెజెండ్స్ తో ఎన్నో ఈవెంట్స్ ఏర్పాటు చేసి మా అస్సోసియేషన్ కు ఆదాయం తీసుకు వస్తాను.
నాకు ఈ ఇండస్ట్రీ చాల ఇచ్చింది దాని నుంచి కొంచెం తిరిగి ఇస్తే చాలు మా అసోసియేషన్ కు అవసరమైన భవనాన్ని నేనే సొంతంగా నిర్మించగలను అంటూ ప్రగల్బాలు పలికిన మంచు విష్ణు హామీలన్నీ ఎన్నికల తరువాత పొగమంచులా కరిగిపోయాయనే చెప్పాలి.
మా ఎన్నికల తరువాత రెండు నెలల పాటు మీడియాలో సందడి చేసిన ఈ విష్ణు ప్యానల్ సభ్యులు కానీ విష్ణు కానీ మళ్ళీ ఇంతవరకు ‘మా’ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చూస్తుంటే విష్ణు తండ్రి మోహన్ బాబు సినిమాలో ”ఇంతన్నాడు అంతన్నాడే…గంగరాజు నట్టేట్లో ముంచేసాడే గంగరాజు”…! అనే పాట గుర్తురాక మానదు.
Actor Imran Khan is facing fresh controversy after taking part in a protest in Mumbai.…
Ram Charan is reportedly giving Sukumar complete freedom to shape their next collaboration, tentatively titled…