Telugu

టీజర్ టాక్: ‘టీజర్’లో ఫీల్ ఉంది…మరి సినిమాలో?

చిన్న సినిమా..పెద్ద సినిమా అంటారు గాని, నాకు తెలిసి అలా ఏమి ఉండదు. నచ్చితే అది మంచి సినిమా, నచ్చకపోతే మరొక రకం లెండి. అయితే ‘బాబు’ల పర్వం నడుస్తున్న క్రమంలో పెద్ద హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.

[m9ad]

ADVERTISEMENT

అయితే చిన్న సినిమాలు మాత్రం నచ్చితే ఇక రచ్చ రంబోలానే. మరి కథపై నమ్మకమో లేక అందరిలా చేసే ప్రయత్నంలో భాగమో తెలీదు కానీ ‘మంచు కురిసే వేళలో’ అంటూ ఒక కొత్త జంట మన ముందుకు వచ్చేస్తున్నారు. కొన్ని క్షమాల క్రితమే రిలీజ్ అయిన టీజర్ చూస్తే మంచి ఫీల్ ఉంది. హీరో పాత్ర రేడియో జాకీ గా, తానూ వైజాగ్ బీచ్ లో ఒక అమ్మాయి గురించి వివరిస్తున్న రాసిన డైలాగ్స్ ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక హీరో, హీరోయిన్స్ కూడా సింపుల్ గా ఉన్నారు. అయితే ఈ సినిమా టీజర్ చూస్తూ ఉంటే సినిమా అంతా వైజాగ్ లో షూట్ చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇక చివర్లో ‘ఫేక్ స్టోరీ కి ఇంత ఫాలోయింగా’ అంటూ ముగించారు. అయితే ఈ సినిమాని బాల బోడెపూడి తెరకెక్కిస్తున్నారు. ఇక టీజర్ లో వచ్చిన సాంగ్ కూడా లిరిక్స్ పరంగా మంచి అట్టెన్షన్ తీసుకుంటుంది.

మరి టీజర్ పరంగా మంచి ఫీల్ ఉన్న ఈ “మంచు కురిసే వేళలో”… అదే ఫీల్ ని ప్రేక్షకులకు సినిమా మొత్తం కురిపిస్తుందో లేదో…చూడాలి. ఏదేమైనా లవ్ మూవీ లవర్స్ అయితే ఒక లుక్ వెయ్యొచ్చు ఈ టీజర్ పై.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK 47 Overseas Pre-Sales: Big Combination, Low Buzz?

Venkatesh and Trivikram Srinivas duo is a crazy combination for Telugu movie lovers. Whenever the…

32 minutes ago

Sita Controversy: Nayanthara Praised, Sai Pallavi Slammed

Old-generation music director Saluri Vasu Rao has slammed Sai Pallavi’s casting as Sita in Ramayana,…

1 hour ago