
ట్రైలర్ లో మంచి రసవత్తరమైన డైలాగులు, అనేక ముద్దు సీన్లతో యూత్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ట్రైలర్ బానే ఉందని చెప్పుకోవచ్చు. రకుల్ దుబ్బింగ్ పెద్దగా అతికినట్టు లేదు. అదే సమయంలో లేటు వయసులో నాగార్జున లిప్ లాకులు కూడా కొంత అబ్బెటుగా ఉన్నా స్టోరీ ప్రకారం అవి ఉండాల్సినవే. ఆగష్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అనసూయ క్షణం సినిమా తప్ప సినిమాకు బాక్స్ ఆఫీసు వద్ద పోటీ అనేదే లేదు. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్.. ఈ సినిమాతో వరుసగా రెండో హిట్టు కొడతాడేమో చూడాలి.
2006లో వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమా ‘ప్రేతే మొయి తా మై’ అనే ఆ సినిమా రీమేక్ ఇది. ఆ సినిమాలో ఒక నలభై ఏళ్ల హీరో పెళ్లి చేసుకోమని ఇంట్లో అందరూ పోరు పెడుతుంటే ఒక అమ్మాయిని పెళ్ళాంగా అద్దెకు తెచ్చుకుంటాడు. అక్షరగౌడ, రకుల్ ప్రీతి సింగ్, కీర్తి సురేష్ లాంటి భామలు నటిస్తున్నారు. నాగార్జున కోడలు సమంత కూడా చిన్న పాత్ర చేసిందట. 2016లో వచ్చిన ఊపిరి తరువాత నాగార్జునకు సరైన హిట్ లేదు. ఆ సినిమా తరువాత వచ్చిన ఐదు సినిమాలు ప్లాపులుగా మిగిలిపోయాయి. ఈ చిత్రంతో పాత బాకీ తీర్చాలని కసిగా ఉన్నాడు నాగ్.
Photos: Trisha Turns Heads In Saree At CM Event
Indian travellers flying through Europe have received major relief after France removed a visa rule…