
మావోలంటే అడవులలోనే ఉంటారు, నగరాలలో కనిపించరు అనుకునే వారికి నేడు మావోలు బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఛత్తీస్ గఢ్ కు చెందిన 27 మంది మావోలు విజయవాడ నగర శివార్లలలోని కానూరు, ఆటోనగర్ ప్రాంతాలలో అధికారుల సోదాల్లో పట్టుబడ్డారు.
అలాగే అటు కాకినాడ ప్రాంతంలోనూ పెద్ద సంఖ్యలో మావోయిస్టులను అరెస్టు చేసినట్లు అదనపు డీజీ మహేష్ చంద్ర లడ్డా ప్రకటించారు. అయితే విజయవాడలో పడ్డుబడ్డ 27 మందిలో 12 మంది మహిళలు, 4 గురు కీలక నేతలు ఉన్నట్టు సమాచారం.
కూలీ పనుల కోసం నగారానికి వచ్చినట్టు నమ్మించి వీరంతా ఒకే భవనంలో బస చేస్తున్నారు. అయితే కేంద్ర బలగాలతో పాటుగా ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు కలిపి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో వీరంతా పోలీసులకు పట్టుబడ్డారు. అయితే వీరి అరెస్టుతో ఆ బృందం వద్ద ఉన్న నాలుగు డంపింగ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ పరిణామంతో విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తమ చుట్టూ ఇంత పెద్ద స్థాయిలో మావోలు, వారి ఆయుధాలు ఉండడంతో ఎవరిని నమ్మాలో ఎవరి అనుమానించాలో తెలియని స్థితిలో ఉన్నారు బెజవాడ వాసులు.
అయితే, గత కొంతకాలంగా కేంద్ర బలగాలు జరుపుతున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా చేపట్టిన కూమ్బింగ్ లో అధికారులకు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున మావోలు పట్టుబడ్డారు.
అలాగే అటు అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతంలో అధికారులకు మావోలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులలో మావోల మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్ కౌంటర్ లో మరణించారు.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…