Telugu

గెద్దల్లా పొడిచే బుద్దులు మారవా … సమంతాకు ఇవ్వాల్సింది సపోర్ట్

ఎంత సినిమా తారలైనా వాళ్ళూ మనుషులే. ఏదో తెరమీద విన్యాసాలు చేసినంత మాత్రాన నిజ జీవితంలో వాళ్లకు ఎలాంటి కొరత ఉండదని కాదు. ఒకప్పుడు బొంబాయి లాంటి బ్లాక్ బస్టర్ తో రజనీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసిన మనిషా కొయిరాలా, బాలీవుడ్ లో మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు లాంటి అగ్ర హీరోల సరసన జట్టు కట్టిన సోనాలి బెంద్రే వీళ్లంతా విపరీతమైన స్టార్ డంని ఎంజాయ్ చేసినవాళ్ళే. కానీ క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తూ బ్రతకడమే సవాల్ గా రోజులు గడిపి చివరికి విజేతలుగా నిలవడం చూశాం. ఇప్పటి హంసా నందిని దాకా ఎన్నో ఉదాహరణలున్నాయి.

కోట్ల డబ్బు ఉన్నంత మాత్రాన అన్నీ కాళ్ళ కిందకు వచ్చేయవు. అనుకున్నవన్నీ జరిగిపోవు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు దాని తాలూకు నరకం కేవలం అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. మరణం అంచుల దాకా వెళ్లి గెలిచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఉదంతం చూశాంగా. ఆ విషయంలో కొన్ని మీడియా ప్లస్ యూట్యూబ్ ఛానల్స్ చూపించిన అత్యుత్సాహం, ఓవరాక్షన్ ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేరు. ఇప్పుడు సమంతా వంతు వచ్చింది. యశోద ట్రైలర్ లాంచ్ సందర్భంగా చిక్కిపోయిన ఆమెను చూసి అభిమానులు కలవరచెందిన మాట వాస్తవం.

ADVERTISEMENT

ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న జ్ఞాపకాలు, శారీరకంగా మానసికంగా విసిరిన సవాళ్లు అంత సులభంగా మాసిపోవు. సహజంగానే ఆ దిగులు, కొరత ఖచ్చితంగా మొహంలో కనిపిస్తుంది. అదే సమంతాకు జరిగింది. కానీ నైతికత మరిచి కేవలం వ్యూస్ కోసమే తాపత్రయపడే కొన్ని యూట్యూబ్ ఛానల్ కేవలం ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి తను ఇంకా కోలుకోలేదనే రీతిలో హెడ్డింగులు పెట్టడం వగైరా చూస్తే అసలు ఇలా ఆలోచించేవాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. చిన్న జలుబు చేస్తే రెండు మూడు రోజులు పట్టే వాతావరణంలో రోగంతో యద్ధమే చేసిన సామ్ కు ఇంకెంత టైం కావాలో ఆలోచించాలిగా.

కేవలం తన పేరు మీద మార్కెటింగ్ చేస్తూ కోట్లు ఖర్చు పెట్టిన దర్శక నిర్మాతల కోసం సమంతా త్వరగానే బయటికి వచ్చింది. అందుకు అభినందించాల్సింది పోయి ఇలా చేయడం నైతికత కిందకు రాదు. తను కోరుకునేది సపోర్టే తప్ప సానుభూతి కాదు. వ్యక్తిగత జీవితంలో పెళ్లి విడాకుల గాయం ఇంకా పచ్చిగా ఉండగానే ఇలా వ్యాధితో పోరాడాల్సి రావడం, ఎన్నో ఛాలెంజులకు ఎదురీదడం ఇవన్నీ మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. స్టార్లు పబ్లిక్ ప్రాపర్టీ కావొచ్చు. కానీ అది తెరమీద కనిపించే సినిమాలకు వరకే పరిమితం. అంతకు మించి వ్యక్తిగతంగా వెళ్లే హక్కు ఎవరికీ ఉండదు లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Why Ranabaali Raises Big Doubts on Prabhas’ Fauzi?

Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…

7 minutes ago

Sai Pallavi’s Warrior Avatar: Why Ramayana Fans Angry?

The promotional materials for Nitesh Tiwari’s Ramayana are back in the headlines again. While the…

36 minutes ago