
మే నెల వస్తోంది. హిట్టు కోసం ఆరాటపడుతున్న మీడియం రేంజ్ హీరోలందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గోపీచంద్ ‘రామబాణం’ 5న వస్తోంది. ట్రైలర్ చూస్తే దర్శకుడు శ్రీవాస్ కొత్తగా ఏమీ ప్రయత్నించలేదన్న కామెంట్ వినిపిస్తోంది కానీ ఆయన ధీమా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కొడతామనేలా ఉంది. సరే అదెలాగూ మొదటి ఆటకే తేలిపోతుంది కాబట్టి చూడాలి. నాంది తర్వాత సీరియస్ జానర్ వైపే సీరియస్ గా చూస్తున్న అల్లరి నరేష్ ‘ఉగ్రం’తో అదే రోజు వస్తున్నాడు. విజయ్ కనక మేడల కాంబోలో రెండో ప్రాజెక్ట్.
సీరియస్ పోలీసాఫీసర్ రివెంజ్ డ్రామాని స్పషంగా ముందే చెప్పేశారు కాబట్టి అసలు కంటెంట్ బలంగా ఉంటేనే అల్లరోడికి మరో హిట్టు పడుతుంది. 12న నాగచైతన్యకి ‘కస్టడీ’ రూపంలో పెద్ద పరీక్ష ఎదురుకానుంది. అసలే తమిళ డైరెక్టర్. ఈ మధ్య మన హీరోలకు బొత్తిగా కలిసి రావడం లేదు. పైగా వరస ఫ్లాఫుల్లో ఉన్న కృతి శెట్టి హీరోయిన్. బంగార్రాజు తర్వాత రెండు ఫ్లాపులు చూసిన చైతుకి దీని విజయం చాలా కీలకం. వన్ మూవీ సెన్సేషన్ గా నిలిచిన విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’నే నమ్ముకుని 2 తగిలించి కొత్త కథతో వస్తున్నాడు.
ఆపై వారం దాటగానే శ్రీవిష్ణు సామజవరగమన, సంతోష్ శోభన్ అన్నీ మంచి శకునములేతో 18న పలకరిస్తారు. ఇద్దరి ట్రాక్ రికార్డు ఎంత డ్యామేజ్ లో ఉందో తెలిసిందే. గత కొంత కాలంగా మాములు డిజాస్టర్లు తగ్గలేదు. ఏ హీరోని చూసుకున్నా మే నెల మొత్తం గెలుపు కోసం పోరాటం బ్యాచ్ లా ఉంది. ఎవరికీ భీకరమైన ఓపెనింగ్స్ తెచ్చే రేంజ్ లో లేదు. పూర్తిగా టాక్ ని నమ్ముకుని దిగాల్సిందే. యావరేజ్ అనిపించుకున్నా లాభం లేదు. చాలా బాగుందనే మాట వస్తే తప్ప గట్టెక్కవు. మరి విజయలక్ష్మి ఎందరిని వరిస్తుందో చూడాలి.
South Indian cinema has historically been aligned with commercial format of filmmaking, and this is…
MS Dhoni's role at Chennai Super Kings (CSK) has become a talking point ahead of…