
ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. నవంబర్ 1న రవిబాబు దర్శకత్వం వహించిన ఆవిరి సినిమా మాత్రమే మీకు మాత్రమే చెప్తాకు పోటీ కాబోతుంది. రవిబాబు ఉన్న ఫామ్ కారణంగా అసలు ఆవిరికి ఎటువంటి హైప్ లేదు. దానితో మీకు మాత్రమే చెప్తాకు పెద్దగా పోటీ లేదనే చెప్పుకోవాలి.
మీకు మాత్రమే చెప్తా డైరెక్టర్ షమ్మీర్ సుల్తాన్ ఈ సినిమా కాన్సెప్ట్ మొదట విజయ్‌కు చెప్పాడట, అప్పటి కి అర్జున్ రెడ్డి విడుదల కాలేదు. అర్జున్ రెడ్డి విడుదల తరువాత విజయ్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ ఇది. కానీ అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అందుకే విజయ్ ఈ సినిమాలో యాక్ట్ చేయకుండా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
షమ్మీర్ సుల్తాన్ మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి హీరోగా సంచలనాలు సృష్టించిన విజయ్ దేవరకొండ.. నిర్మాతగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
Prabhas is celebrating his birthday, and fans have found yet another reason to celebrate the…
ఆంధ్రప్రదేశ్‌లో ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త భయానక వాతావరణం మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో కనిపిస్తోంది. ఇంతవరకు జరిగిన, ఇంకా…