
అందుకు తగ్గట్లుగా బాగా తయారై పెళ్లిళ్లకు వెళ్లేవాడినని, అక్కడి చిన్న పిల్లలతో బాగా ఆడుకుని అలసిపోయి నిద్రపోయేవాడినని, పోన్లే మళ్లీ పెళ్లిలో చూడొచ్చని తనకు తాను సర్ది చెప్పుకునేవాడనని బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు. దీంతో చిరంజీవి ‘అయితే ఓ పని చేయండి… మీ పెళ్లి కార్డులో మీ పేరు ముందు చిరంజీవి అని అచ్చేయించుకోండి… తప్పకుండా వస్తాను’ అని మాట ఇచ్చారు.
‘పెళ్లికి వస్తానని నేను మాటిచ్చేశాను సరే… ఇంతకీ నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా?’ అని మెగాస్టార్ చమత్కరించడంతో షో అంతా నవ్వులమయం అయ్యింది. ఇంతలో దీంతో రష్మీ కలుగ జేసుకుని ‘సరైన పాయింట్ పట్టుకున్నారు సర్… అలా అడగండి’ అంటూ ఆట పట్టించింది. దీంతో ప్రదీప్… ‘తనకు అరేంజ్డ్ మేరేజ్ అంటే ఇష్టం అని, ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తున్నారని, వాళ్లెవరిని ఎంపిక చేస్తే వారినే చేసుకుంటానని’ వెల్లడించాడు. అయితే ‘నా పెళ్లికి మీరు వస్తానన్నారు కాబట్టి… కొంచెం వేగంగా వెతకమని’ చెప్తానని ప్రదీప్ కూడా చమత్కరించారు.
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…