
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నపేరు, తరుచుగా కనిపిస్తున్నఫేసు హీరోహిన్ మీనాక్షి చౌదరి. గత సంక్రాంతి మహేష్ గుంటూరు కారం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఈ సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీ మామతో కలిసి జనవరి 14 న సంక్రాంతికి వస్తున్నారు.
అయితే ఈ గడిచిన ఏడాది సమయంలో మీనాక్షి చేసిన సినిమాలు గుంటూరు కారం, గోట్, మెకానిక్ రాకీ, మట్కా, లక్కీ భాస్కర్. అయితే వీటిలో ఒక్క లక్కీ భాస్కర్ మినహా మిగిలిన అన్ని సినిమాలలోనూ మీనాక్షి తో పాటుగా మరో హీరోయిన్ ఉన్నారు. ఇలా తన ప్రతి సినిమాలో మరో తారతో కలిసి నటించడం యాధృచ్ఛికమో లేక ఆ అమ్మడికి అలా కలిసి వచ్చిందో తెలియదు కానీ ఈ ఏడూ కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉన్న చిత్రం తోనే ఖాతా తెరవనుంది మీనాక్షి.
అయితే ఇందులో మీనాక్షి సింగిల్ హీరోయిన్ చేసిన దుల్కర్, లక్కీ భాస్కర్ మినహాయించి ఏ ఒక్కటి కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. గుంటూరు కారం లో ప్రస్తుత క్రెజీ హీరోయిన్ శ్రీ లీలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇక గోట్ లో విజయ్ దళపతి సరసన సీనియర్ హీరోయిన్ స్నేహ తో కలిసి నటించారు.
ఇక విశ్వక్, మెకానిక్ రాకీ లో శ్రద్ధ శ్రీనాధ్, వరుణ్ తేజ్ మట్కా మూవీలో నోరా ఫతేహి ఇలా తను నటించిన ఒక్కో సినిమాలో ఒక్కో హీరోయిన్ తో స్క్రీన్ పంచుకున్నారు మీనాక్షి. ఇక ఈ సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీ సరసన మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తో కలిసి అలరించబోతున్నారు.
అయితే మీనాక్షి ఇద్దరి హీరోహీన్ల సెంటిమెంట్ ఇప్పటి వరకు ఆమెకు సరైన విజయాన్ని తెచ్చిపెట్టలేదనే చెప్పాలి. మరి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ అయినా మీనాక్షి కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చి ఈ సెంటిమెంట్ కు ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి. అయితే విచిత్రంగా ఒక్క ఏడాదిలో ఒక్క విజయంతో సినీ ఇండస్ట్రీలో ఇన్ని అవకాశాలు దక్కించుకోవడం అంటే మీనాక్షి చౌదరి చాలా లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. ఈ 2025 ఈ అమ్మడుకు అవకాశాలతో పాటుగా విజయాలను తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…