Telugu

గ్రాండ్ లెవల్లో ‘మెగా’ ఫెస్టివల్!

ఈ నెల 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రిన్స్ అభిమానులు సోషల్ మీడియాలో సృష్టించిన హంగామా తెలిసిందే. ఈ రోజున ‘స్పైడర్’ టీజర్ విడుదల కావడంతో, ఏకంగా 1.3 మిలియన్ ట్వీట్లతో ప్రిన్స్ పుట్టినరోజును ట్విట్టర్ వేదికగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. అయితే ఆగష్టులో మరో ఇద్దరు స్టార్ హీరోల జన్మదినోత్సవాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22 కాగా, కింగ్ నాగార్జున జన్మదినం ఆగష్టు 29.

అయితే ముందుగా రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఈ సారి కూడా గ్రాండ్ గా ఉండబోతున్నాయన్న సంకేతాలు వచ్చేసాయి. చిరు నటించబోయే 151వ చిత్రం “ఊయ్యాలవాడ నరసింహారెడ్డి” చిత్రం లోగోను విడుదల చేయబోతున్నారన్న సమాచారం మెగా ఫ్యాన్స్ ను నూతన ఉత్సాహంలో ముంచెత్తింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కధ చారిత్రాత్మకం కావడంతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో విడుదల చేయనుండడంతో టార్గెట్ ‘బాహుబలి’ రికార్డులు అని స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

ఇక, మెగా వారసుడు రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం “రంగస్థలం 1985” సినిమా ఫస్ట్ లుక్ ను కూడా మెగాస్టార్ జన్మదినం కానుకగా రానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే లోగో ఆవిష్కరణ జరుపుకున్న ఈ సినిమాలో చెర్రీ సరికొత్త లుక్ లో దర్శనమిస్తుండడంతో అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

అన్నీ సీఎం చంద్రబాబు నాయుడే చూసుకోవాలా?

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. పోలవరం నుంచి గోదావరి జలాలను అనకాపల్లి వైపు విడుదల చేస్తున్న నేపథ్యంలో…

4 minutes ago

Beyond Star Power: Tollywood’s New Box Office Game

Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…

9 minutes ago