Telugu

మన చిరంజీవికి పద్మ విభూషణ్… శభాష్!

కేంద్ర ప్రభుత్వం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. మన అభిమాన తెలుగు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి, తెలుగు అక్షరానికి శ్రీకారం వంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించింది.

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 132 పద్మ అవార్డులలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. వాటిలో మన తెలుగు రాష్ట్రాలకు రెండు పద్మవిభూషణ్, ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు లభించడం చాలా సంతోషకరం.

చిరంజీవి 1978లో తెలుగు సినీ రంగంలో ‘పునాది రాళ్ళు’ వేసుకుని అప్పటి నుంచి నేటివరకు అంటే సుమారు నాలుగున్నర దశాబ్ధాల పాటు నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తన 156వ సినిమా విశ్వంభర చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినీ ప్రస్థానాన్ని మూడు దశలుగా విభజించుకోవచ్చు.

1970-80 దశకాలలో చాలా అద్భుతమైన కధలతో తీసిన ‘మన వూరి పాండవులు’, ‘ఇది కధ కాదు’ వంటి అద్భుతమైన సినిమాలలో విభిన్న పాత్రలు చేసి అందరినీ మెప్పించారు.

ఆ తర్వాత 1980-2010 మద్య ఖైదీ, బిల్లా రంగా, కొండవీటి రాజా, రాక్షసుడు, చంటబ్బాయి, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠామేస్త్రీ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, హిట్లర్, చూడాలని ఉంది, అన్నయ్య, శ్రీ మంజునాధ, ఠాగూర్ , శంకర్ దాదా ఎంబీఏబీఎస్, స్టాలిన్ వంటి అనేక కమర్షియల్, ఫ్యామిలీ సినిమాలు, అలాగే స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాంధవుడు వంటి క్లాసిక్ సినిమాలలో నటించి మెగాస్టార్‌గా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. చిరంజీవి సినీ ప్రస్థానంలో ఇదో సువర్ణా అధ్యాయంగా చెప్పుకోవచ్చు.

చిరంజీవి 2008లో రాజకీయాలలోకి ప్రవేశించి అవి తనకు సరిపడవని తెలుసుకుని మళ్ళీ వెనక్కు వచ్చి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. మొదటి రెండు దశలలో చిరంజీవి చాలా బలమైన ముద్రవేయగలిగారు. 2016 నుంచి సాగుతున్న ఈ మూడో దశలో చిరంజీవి ఇంకా అటువంటి గొప్ప చిత్రాలు ఇవ్వలేదనే చెప్పాలి. బహుశః ‘విశ్వంభర’తో ఆ లోటు తీరుస్తారేమో?

చిరంజీవికి అవార్డులు కొత్తేమీ కాదు. మూడు నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులు, 2006లోనే పద్మ భూషణ్ అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు అందుకోబోతున్నారు. అయితే ఈ అవార్డులు, సన్మానాలు అన్నిటి కంటే తెలుగు ప్రజల గుండెల్లో ‘మెగాస్టార్’గా సంపాదించుకున్న స్థానమే ఆయనకు అతిపెద్ద పురస్కారంగా చెప్పవచ్చు. మన చిరంజీవికి ఇంత గొప్ప అవార్డు లభించడం మనకీ చాలా సంతోషమే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijay Made A Huge Mistake, No Doubt!

Thalapathy Vijay is one of the biggest names associated with Tamil cinema, and he has…

16 minutes ago

Laxman Gave Vaibhav Chances, GG Hasn’t: Is It Fair?

Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…

45 minutes ago