
గురువారం ఉదయం తన అనుచరులతో కలిసి ఉదయగిరిలో బస్టాండ్ వద్దకు చేరుకొని అక్కడ రోడ్డుపై కుర్చీవేసుకొని మీడియా ద్వారా అనిల్కు సవాల్ విసిరారు. “నువ్వేదో పెద్ద పోటుగాడిననుకొంటున్నావేమో… ఇదిగో ఉదయగిరికి వచ్చా… ఇక్కడే కూర్చొని ఎదురుచూస్తున్నా… దమ్ముంటే రండి ఎవరొస్తారో…ఏం చేస్తారో… నేను చూస్తాను. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న మీరందరూ ఒకప్పుడు నా కాళ్ళదగ్గర పడి బ్రతికేవారనే సంగతి అప్పుడే మరిచిపోయారా? దమ్ముంటే రండి… నేను ఇక్కడే మీకోసం ఎదురుచూస్తుంటాను.
నన్ను ఎవరనుకొంటున్నారు మీరు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ! నా గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడితే నేను కాదు ముందు జనాలే మీ నోరు మూయిస్తారు జాగ్రత్త. వచ్చే ఎన్నికలలో నేను గెలవనని చెపుతున్నావు. ముందు నువెన్ని ఓట్లతో గెలిచావో గుర్తు చేసుకో. 60 వేలకు పైగా మెజార్టీతో గెలిచిన నేనెక్కడ సింగిల్ డిజిట్తో గెలిచిన నువ్వెక్కడ? గత ఎన్నికలలో మా అందరి సాయంతో గెలిచావు. వచ్చే ఎన్నికలలో అడ్రస్ లేకుండా పోతావు గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు గెలిస్తే నేను రాజకీయాలనుంచి తప్పుకొంటాను. నేను గెలిస్తే నువ్వు తప్పుకొంటాన్నావు కదా? అందుకు సిద్దంగా ఉండు. నేనే కాదు… ఆనం రామనారాయణ రెడ్డి, కోటగిరి శ్రీధర్ రెడ్డి కూడా గెలుస్తారు. కానీ ముందు మాతో పోటీ చేయడానికి నీకు మీ జగన్న టికెట్ ఇస్తారో లేదో తెలుసుకో. ఎందుకంటే ఈసారి నీకు టికెట్ రాదని విన్నాను,” అంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Is Tabu set to surprise fans with a special glimpse this Dasara? According to the…
మాస్ మహారాజ్ ఇటీవల ‘ఇరుముడి’ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. అయితే ఆ సినిమాలో ఓ పక్క అయ్యప్పస్వామి పూజలు,…