
ఆహ్లాదకరంగా సాగిన ఈ ట్రైలర్ అక్కడక్కడ ‘పెళ్లిచూపులు’ సినిమా ఛాయలు కనపడుతున్నాయి. అమాయకపు అబ్బాయి – దూకుడైన అమ్మాయి మధ్యలో సాగిన భావోద్వేగాలకు తగ్గట్లుగా ‘మెంటల్ మదిలో’ అన్న టైటిల్ ను పెట్టినట్లుగా ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ప్రతి విషయంలోనూ ఏం నిర్ణయించుకోలేని ‘డబుల్ మైండెడ్ అబ్బాయి’ పాత్రలో శ్రీవిష్ణు, తనేం చేయాలో పూర్తి స్పష్టత ఉన్న పాత్రలో నివేతా పేతురాజ్ కనిపిస్తోంది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. ‘పెళ్లిచూపులు’ సినిమా సక్సెస్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంచుకుని ఈ సినిమాను నిర్మించడంతో, పబ్లిసిటీ పరంగా మార్కెట్ చేసుకోవచ్చు. ఆ స్థాయికి తగ్గ సినిమానే మళ్ళీ తెరకెక్కించినట్లుగా కనపడుతోంది. అయితే ఈ ఫీల్ గుడ్ మూవీని ఎంతవరకు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లగలరు? అనేది వేచిచూడాలి. ట్రైలర్ పరంగా అయితే ‘ఓకే’ అనిపిస్తుంది.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…