
అన్ని దేశాలలో, అన్ని రంగాలలో మహిళలకు పురుషుల నుంచి ఎప్పుడో ఒకప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉంటారు. సినీ పరిశ్రమలో అది మరికాస్త ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే సినీ పరిశ్రమలో నిలద్రొక్కుకోవడం కోసం లేదా అవకాశాల కోసం కొందరు యువతులు కూడా మగవాళ్ళ ఈ బలహీనతని ఉపయోగించుకోవడానికి వెనకాడారని మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న మిర్చి మాధవి తాజా ఇంటర్వూలో బయటపెట్టారు.
“అలాంటివారికి ఇలా చేయడం తప్పని నేను నచ్చజెప్పాలని ప్రయత్నిస్తే, నీకెందుకు? అని తిరిగి ప్రశ్నిస్తారు. కనుక నేను వాళ్ళ జోలికి పోను. కానీ సినీ పరిశ్రమలో ఎవరైనా నాతో అసభ్యంగా ప్రవర్తిస్తే తప్పకుండా వాళ్ళ మొహం మీదనే చెప్పేస్తా,” అన్నారు మాధవి.
సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియక నాకు సినిమాలో లీడ్ రోల్ ఇస్తానన్న ఓ దర్శకుడు ఇంటికి వస్తానంటే రమన్నమని చెప్పాను. అతను నాకు సినిమా గురించి చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకునేందుకు వస్తున్నారని అనుకున్నాను.
కానీ అతను ఇంట్లోకి రాగానే నేను కట్టుకున్న చూదీదార్ విప్పేసి చీర కట్టుకొని రమ్మనమని చెప్పినప్పుడు కూడా నాకు అనుమానం కలుగలేదు. ఆడిషన్ కోసమే అనుకొని రెండుసార్లు చీర మార్చుకొని వచ్చి అతని ఎదుట నిలబడ్డాను.
కానీ అతను నా నడుము చూపించమన్నప్పుడు దేని కోసం వచ్చాడో అర్దమైంది. చెప్పు తీసి కొట్టబోతే వెంటనే పారిపోయాడు,” అంటూ కొత్తలో తనకు ఎదురైనా క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాధవి వివరించారు.
అయితే నేటికీ సినీ పరిశ్రమలో ఈ క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతూనే ఉందని మాధవి చెప్పారు. కానీ లోకాన్ని ఉద్దరించాల్సిన బాధ్యత నాది కనుక ఆ సమస్య నా వరకు రానప్పుడు నేను ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా నా పనేదో నేను చూసుకుంటానని మాధవి చెప్పారు.
అయితే సినీ పరిశ్రమలో మగవాళ్ళ ఈ బలహీనతకి ‘క్యాస్టింగ్ కౌచ్’అనే గంభీరమైన పేరు పెట్టుకున్నప్పటికీ ఆ పేరుతో తమ శారీరికవాంఛలు తీర్చుకుంటున్నారని మాధవి అన్నారు. వారి ఈ బలహీనత చూస్తున్నప్పుడు మగవాళ్ళకు ఎప్పుడూ ఇదే ఆలోచనతో ఉంటారా? ‘క్రియేటివ్ ఫీల్డ్’లో ఉన్నామనే స్పృహ కూడా ఉండదా? అనిపిస్తుందన్నారు.
అయితే చాలా కాలం క్రితం సినీ పరిశ్రమలో ఓ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ ఈ ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడుతూ, “దీనిని బార్టర్ సిస్టంతో పోల్చవచ్చు. వారికి కావాల్సింది వారికి ఇచ్చి మనకి కావాల్సింది మనం తీసుకుంటాము. దీనిలో నో రిగ్రెట్స్… నో హార్డ్ ఫీలింగ్స్.. జస్ట్ అదొక పరస్పర ప్రయోజనంగా మాత్రమే నేను చూస్తాను,” అని అన్నారు.
ఇటువంటి భిన్నమైన ఆలోచనలు, ఎవరి లెక్కలు వారికి ఉన్నందునే నేటికీ సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ కొనసాగుతోందని సరిపెట్టుకోవాలేమో?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…