
భారతీయ ప్రేక్షకులకు క్రైమ్, యాక్షన్ సినిమాలు, ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ కథలు కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా వెండితెరపై మాఫియా ప్రపంచం, రక్తపాతం, ప్రతీకార కథలతో తీసిన సినిమాలు చూస్తూనే ఉన్నారు. కానీ ఓటీటీ ప్రపంచంలోకి వచ్చిన ‘మీర్జాపూర్’ మాత్రం భారతీయ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని అందించింది.
క్రైమ్‌ను కేవలం నేరంగా కాకుండా, వినోదంగా ఆస్వాదించేలా చేసిన వెబ్ సిరీస్‌గా మీర్జాపూర్ నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌లో కాలీన్ భయ్యా రాజకీయ తెలివితేటలు, గుడ్డు పండిట్ ఆవేశం, మున్నా భయ్యా ఊహించని ప్రవర్తన ప్రేక్షకులను మీర్జాపూర్ అనే ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. 2018లో విడుదలైన తొలి సీజన్‌కు అపూర్వమైన ప్రేక్షకాదరణ లభించడంతో 2020లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ కూడా తీసి విడుదల చేస్తే అవి కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి.
వేరే సినిమాల స్ఫూర్తితో కొత్త సినిమాలు నిర్మించడం పరిపాటి. కానీ తొలిసారిగా ఈ వెబ్ సిరీస్ స్ఫూర్తితో ఈ సినిమా నిర్మిస్తుండటం విశేషం.
ఈ వెబ్ సిరీస్‌ను ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో సినిమాగా తీస్తున్నారు. నేడు విడుదలైన టీజర్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచిందనే చెప్పాలి.
దీనిలో కూడా పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. వెబ్ సిరీస్‌గా సంచలనం సృష్టించిన మీర్జాపూర్, ఇప్పుడు సినిమాగా కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా?
ఓటీటీలో ప్రేక్షకులు ఆస్వాదించిన ఆ క్రైమ్ ప్రపంచం వెండితెరపై కూడా అదే స్థాయిలో అలరిస్తుందా లేదా? అనే ప్రశ్నలకు సెప్టెంబర్ 4న సమాధానం లభిస్తుంది.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…