
అయితే ఒకప్పుడు తెలంగాణా వ్యతిరేకి అనిపించుకున్న గవర్నర్. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా సన్నిహితం అయిపోయారు. ఇదే ఇప్పుడు ఆయనకు తలపోట్లు తెచ్చిపెడుతుంది. ఇటీవలే తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం మీద ఏదో కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్లగా ఆయన కేసీఆర్ ప్రభుత్వంను వెనకేసుకుని వచ్చారట.
దీనితో రాజ్ భవన్ లోనే కాంగ్రెస్ నాయకులు ఆయనను విమర్శించారు. మరోవైపు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఇదివరకు చేసిన విమర్శలను కట్టడి చేసే ప్రయత్నం కూడా చెయ్యట్లేదు బీజేపీ. తాజాగా ఆయన మరోసారి గవర్నర్ పై విరుచుకుపడ్డారు.
గవర్నర్ ఏ రోజైనా కుటుంబ పెద్దలా వ్యవహరించారా? అని ప్రశ్నించారు. ఏపీలో పట్టుమని వారం రోజులైనా ఉన్నారా? అని ఆయన నిలదీశారు. ఏపీకి ప్రత్యేకంగా గవర్నర్ కావాలని… పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ కేంద్రాన్ని కోరాలని, తాము కూడా కేంద్రం, బీజేపీ అధిష్టానాన్ని కోరతామని విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఈ విమర్శలు ఏమైనా గవర్నర్ ను సాగనంపే ప్రయత్నమా?
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…
Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…