
ఆయన ఈరోజు రాజమండ్రి ప్రెస్క్లబ్బులో మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు పలు ప్రశ్నలు సందించారు. అవన్నీ యదాతదంగా చెప్పుకోవాలంటే ఓ పుస్తకమే ప్రచురించాల్సి ఉంటుంది. కనుక క్లుప్తంగా ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటో తెలుసుకొందాం.
· అనంతబాబు ఒక్కడే ఈ హత్య చేశాడంటారు. కానీ ఎఫ్ఐఆర్లో అనంతబాబుతో పాటు మరికొందరు ఉన్నారని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో మొత్తం ఎంత మంది పాల్గొన్నారు? వారి వివరాలు పోలీసులు ఎందుకు బయటపెట్టడం లేదు. అసలు ఇంతవరకు వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?
· డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒంటిపై 31 గాయాలు, అంతర్గతంగా మూడు తీవ్ర గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తెలిపారు. అనంతబాబు ఒక్కడే ఇన్ని గాయాలు చేయగలడా?ఒకవేళ గాయపరిచి ఉంటే ఆయన ఒక్కడే అతని మృతదేహాన్ని మోసుకొని తీసుకురాగలరా?
· పోలీసులు కోర్టుకు సమర్పించిన అరెస్టు మెమోలో అనంతబాబుకి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని పేర్కొన్నారు. కానీ 2014లో అనంతబాబుపై అడ్డతీగల పోలీస్స్టేషన్లో రౌడీ షీట్ ఉంది కదా? దానిని అరెస్టు మెమోలో ఎందుకు పేర్కొనలేదు?
· అనంతబాబుపై పోలీస్స్టేషన్లో రౌడీ షీట్ ఉన్నప్పుడు వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చింది?చట్టసభలలో ఇలాంటివారున్నప్పుడు ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి సామాన్యుల మానవహక్కులు ఏవిదంగా కాపాడగలరు?
· సెక్షన్ 164 ప్రకారం ఇంతవరకు మేజిస్ట్రేట్ ముందు సాక్షుల వాంగ్మూలం ఎందుకు నమోదు చేయలేదు?
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…