
వైసీపీ నేతల కనుసన్నలలో పనిచేస్తున్న పోలీసులు ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావించడం లేదని కనుక ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని, డిజిపిని కలిసి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరినప్పటికీ వారు పట్టించుకోలేదు కనుకనే హైకోర్టును ఆశ్రయించినట్లు వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్రహోంశాఖ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులను, రాష్ట్ర డిజిపి, సీఐడీ డైరెక్టర్, విశాఖ సీబీఐ ఎస్పీ, తూర్పు గోదావరి జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసు నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని తప్పించడానికి పోలీసులు ఏవిదంగా ప్రయత్నించారో లిఖితపూర్వకంగా వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు కాకినాడ జిల్లా వైద్యఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది. అయితే తమ కుటుంబంలో చీలిక సృష్టించి ఈ కేసును నీరు గార్చేందుకే తమ కోడలికి ఉద్యోగం ఇచ్చారని సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశిస్తే, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…