
అప్పటి నుంచి అతను బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మొదట ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే తిరస్కరించింది. తర్వాత అక్టోబర్ నెలలో మరోసారి హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా హైకోర్టు కూడా తిరస్కరించింది. దాంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ఆ పిటిషన్పై నేడు విచారణ చేపట్టి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. బెయిల్ షరతులను హైకోర్టు ఖరారు చేయాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణని మార్చి 14కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
అనంతబాబు హత్య కేసులో జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ నుంచి బహిష్కరిస్తునట్లు వైసీపీ ప్రకటించింది. కానీ ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేసేసేందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం. నేటికీ కాకినాడ జిల్లాలో పలువురు వైసీపీ నేతలు అనంతబాబుని పార్టీలో ఉన్నట్లుగానే పరిగణిస్తున్నారు. ఇప్పుడు అతనికి బెయిల్ మంజూరు అవడం, మార్చి 14వరకు ఈ కేసు విచారణ వాయిదా పడినందున అనంతబాబు స్వేచ్చగా తిరగవచ్చు. కనుక అతను అతని అనుచరులు మళ్ళీ కాకినాడలో చెలరేగిపోవచ్చు. కనుక అతనిపై కేసు వేసిన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…