Telugu

మద్యం, డ్రగ్స్, పేకాట.. ఇప్పుడు మొబైల్, రీల్స్ కూడా వ్యసనాలే

కొందరికి రీల్స్ చేయడం పిచ్చి.. మరి కొందరికి ఆ రీల్స్ చూడటం పిచ్చి. ఆ రీల్స్ చేసేవారు, చూసేవారు పొందే ఆనందం కంటే ఆ పిచ్చితో జీవితాలు నాశనం చేసుకుంటున్నవారే ఎక్కువ.

ఈ రీల్స్ పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి వార్తలు తరచూ చూస్తూనే ఉంటాము. తాజాగా రీల్స్ చూడొద్దని తల్లి మందలించినందుకు కూతురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది!

ADVERTISEMENT

అలాగని ఆమె తెలిసీ తెలియని టీనేజ్ పిల్ల కాదు. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త పెయింటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

కొన్ని వారాల క్రితమే ఆమెకు మొబైల్ ఫోన్ కొని ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె దానికి బానిసగా మారింది. ఎంతగా అంటే, తమతోనే నివసిస్తున్న తల్లి చుట్టుపక్కల ఇళ్ళలో పని చేస్తుంటే, ఆమె మాత్రం ఫోన్లో రీల్స్ చూస్తూ ఇంట్లో కాలక్షేపం చేస్తోంది.

రెండు రోజుల క్రితం తల్లి అలివేలు ‘ఏ పని చేయకుండా ఎప్పుడూ ఆ ఫోన్ చూస్తూ కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుంది. ఏదైనా పని చేసుకోవచ్చు కదా?” అని మందలించినందుకు ఆమె నొచ్చుకుంది.

కానీ తల్లి ఎందుకు చెప్పిందో అర్థం చేసుకోకుండా ఇంట్లోనే ఉన్న పిల్లలిద్దరినీ కాసేపు టీవీ చూడమని చెప్పి, పక్క గదిలోకి వెళ్ళి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది!

మొబైల్ ఫోన్లు, వాటిలో వస్తున్న రీల్స్ మనుషుల ఆలోచనా విధానాన్ని ఎంతగా మార్చేస్తాయో, ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ఈ విషాద ఘటన తెలియజేస్తోంది.

రీల్స్ చేయడం, చూడటం తప్పు కాదు. కానీ ఇలా ప్రాణాలు తీసుకునే అంత వ్యసనంగా మారితేనే సమస్య.

మొబైల్ ఫోన్ కోసం ప్రాణాలు తీసుకునే పరిస్థితికి చేరుకోవడం అంటే ఇది మద్యం, డ్రగ్స్, పేకాట వంటి వ్యసనాలతో సమన స్థితికి చేరుకున్నట్లే అని భావించాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఈ మొబైల్ పిచ్చి, రీల్స్ పిచ్చి సమాజంలో ఆడ, మగ, చిన్నా పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తున్న వ్యసనంగా మారింది. అగ్గిపుల్లతో దీపం వెలిగించుకోవచ్చు ఇల్లు తగులబెట్టుకోవచ్చు. ఇదీ అలాంటిదే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Karnataka Star’s Masterclass Puts Team India Ahead

India finished Day 3 of the first Test against New Zealand at 486/4, taking a…

13 minutes ago

Hanuman 2: Vaisshnav Tej Teams Up with VI Anand

After Hanu-Man, Primeshow Entertainment is preparing for another fantasy project. The production house, led by…

37 minutes ago