
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఈ పేరుకు ప్రపంచ వ్యాప్తంగా పరిచయమవసర్లేదు, ప్రతి ఐపీఎల్ ప్రారంభానికి ముందు ‘ఈ సాల కప్ నాందే’ అంటూ హుషారుగా జట్టుకు మద్దతు ప్రకటించటం, సీజన్ మొదలయ్యాక ఆ జట్టు విజయాల దారి మళ్లటం, సెమీస్ లో ఇంటి దారి పట్టటం.. గత 17 ఏళ్లగా ఇదే జరుగుతూ వస్తుంది.
అయితే ఇందుకు ముఖ్య కారణం విరాట్ కాకుండా ఆ జట్టులో ‘ నైపుణ్యం గల భారత ఆటగాడు లేకపోవటమే’ అంటారు చాల మంది. అయితే, వీరి వద్ద అటువంటి ఆటగాళ్లు లేకుండా ఏమి ఉండరు. వీరు అటువంటి ఆటగాళ్లను గుర్తించటంలో విఫలమవుతుంటారు. ఒక రాహుల్, చాహల్, భువనేశ్వర్, మనీష్ పాండే.. ఇలా ఎందరో నైపుణ్యం గల భారతీయులను కొనుగోలు చేసింది ఈ జట్టు, కానీ వీరిని లాంగ్-టర్మ్ లో జట్టులో నిలుపుకోలేకపోయారు.
అదే చెన్నై మరియు ముంబై జట్లను చూస్తే, రోహిత్ శర్మ, హార్దిక్, బుమ్రా, ఇషాన్ కిషన్, తిలక్, సూర్యకుమార్, మళ్ళీ కొత్తగా విగ్నేష్ మరియు అశ్వని కుమార్ వంటి యువకులను చేరదీశారు. మరోపక్క చెన్నై లో ధోని, జడ్డు, అశ్విన్, దూబే, గైక్వాడ్ వంటి వాళ్ళను వారు లాంగ్-టర్మ్ లో జట్టు లో అంటిపెట్టుకుని, జట్టు ఎదుగుదల కు తోడ్పడేలా చేసారు.
మరి గత సీజన్ చూస్కుంటే ఆర్.సి.బీ యాజమాన్యం ‘మొహమ్మద్ సిరాజ్’ వంటి మరొక యువ ఆటగాడ్ని జట్టు నుండి విడుదల చేశారు. సిరాజ్ తన డెబ్యూ ని హైదరాబాద్ జట్టు తో ఆడినా, సిరాజ్ కు కెరీర్ అందించింది మాత్రం బెంగళూరు జట్టే. తొలుత ఎంత చెత్త బౌలింగ్ ప్రదర్శన చేసినప్పటికీ, తనను నమ్మి జట్టు ఇచ్చిన అవకాశాలకు సిరాజ్ కూడా తిరిగి ఎన్నో విజయాలను అందించాడు బెంగళూరు జట్టుకు.
ఆక్షన్ లో ఈ పేసర్ ను ‘గుజరాత్ టైటాన్స్’ జట్టు కొనుగోలు చేసారు. అయితే, జట్టు మార్పిడి తరువాత సిరాజ్ నేడు తొలిసారి పాత జట్టైనా ఆర్.సి.బీ ను ఎదుర్కోనున్నాడు. ముఖ్యంగా ఆర్.సి.బీ అభిమానులంతా ఐపీఎల్ మొదటి ఓవర్ లో సిరాజ్ కోహ్లీ కు బౌల్ చేస్తాడని ఎప్పుడు ఊహించుకోలేదు అనే కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ జరిగేది ఆర్.సి.బీ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ, సిరాజ్ కు అభిమానుల మద్దతు ఎక్కువగానే ఉంటుందనటంలో సందేహమే లేదు.
గత కొంత కాలంగా ఆర్.సి.బీ జట్టు విడుదల చేసిన ఆటగాళ్లు, ఏ జట్టు మీద ఎలా ప్రదర్శినంచినప్పటికీ, ఆర్.సి.బీ అంటే మాత్రం ఎగబడి ఆడుతుండటం చూస్తున్నాం. ఇందుకు నిదర్శనమే శివమ్ దూబే, వాట్సన్, మొయిన్ అలీ ఇలా ఎందరో. మరి, ఇవాళ గుజరాత్-బెంగళూరు పోరులో సిరాజ్ ఆ ఆనవాయితీని కొనసాగిస్తాడేమో చూడాలి..!
The elections to the Telugu Film and TV Dancers and Dance Directors Association will not…
Andhra Pradesh chief minister Chandrababu Naidu is currently serving his fourth term in the office…