Telugu

‘కీయా’లో మహిళలకు పెద్దపీట!

అనంతపురంలో రానున్న ప్రతిష్ఠాత్మక ‘కియా’ కార్ల కంపెనీ పెద్దఎత్తున మహిళా ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి కనబరుస్తోంది. ప్రధాన ప్లాంటుకు అనుబంధంగా విడిభాగాలు తయారు చేసే సంస్థలు పెద్దఎత్తున అనంతపురానికి రానున్నాయి. ఈ కొంపెనీలలో దాదాపు 20000 ఉద్యోగాలు రానున్నాయి.

ఇందులో దాదాపు సగం ఉద్యోగాలలో మహిళలకు అవకాశాలు కల్పించాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. తొలిదశలో దాదాపు 2500 మంది మహిళలకు ఇక్కడ ఉద్యోగాలు రానున్నాయి. అనంతపురం, దాని చుట్టుపక్కల ప్రాంతంలోని మహిళలకు ఆటోమొబైల్‌ తయారీ పరిశ్రమకు సంబంధించి నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారినే తీసుకోనున్నారు.

ADVERTISEMENT

కియా ప్లాంటుకు అనుబంధంగా ఇప్పటికే 19 అనుబంధ సంస్థలు వచ్చాయి. తాజాగా మరో 20 అనుబంధ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించాయి. నవంబరులో ఈ కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఈ కంపనీ కరువు సీమ రూపురేఖలే మారిపోనున్నాయి.

కియా మోటర్స్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆటొమొబైల్ కంపనీ. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపనీ ఇండియాలో తొలి ప్లాంట్ అనంతపురంలోనే పెడుతుంది. ప్లాంట్ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఈ ప్లాంట్‌లోని తొలి కార్ తయారై 2019 ఫిబ్రవరిలో మార్కెట్ లోకి రాబోతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

యలహంకలోనే భద్రత లేదనప్పుడు పులివెందులలో భద్రత సరిపోతుందా?

నేడు రాష్ట్రమంతటా జరుగుతున్న పోలింగ్ ఒక ఎత్తు అయితే పులివెందుల పోలింగ్ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్లు సాగుతోంది. ఎక్కడికక్కడ…

19 minutes ago

పులివెందులలోనే జగన్‌కు ఊహించని షాక్!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి “చొక్కా మడత పెడతా.. పులివెందులలో ఓటు వేస్తా... ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి చూస్తానంటూ..” రెండు…

35 minutes ago