Telugu

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు భారీ వాయిదా తప్పదా?

అఖిల్ అక్కినేని రాబోయే చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇంతకుముందు విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లో, ఈ చిత్రం కోసం సంక్రాంతి విడుదల గురించి మేకర్స్ సూచించినప్పటికీ ఈ సినిమా అప్పటికి రావడం లేదని సమాచారం. అఖిల్ తన మొదటి మూడు చిత్రాలతో డిజాస్టర్ల హాట్రిక్ పూర్తి చేసిన తరువాత వస్తున్న ఈ చిత్రం చాలా కీలకం.

ADVERTISEMENT

కాబట్టి, ఈ చిత్రాన్ని సమ్మర్‌కు నెట్టాలని మేకర్స్ నిర్ణయించారు. ఇది భారీ వాయిదా అనే చెప్పుకోవాలి కానీ ప్రస్తుతం కరోనా కారణంగా ఉన్న అనిశ్చితితో, ఇది తప్పడం లేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్‌ను హ్యాపనింగ్ హీరోయిన్ పూజా హెగ్డే రొమాన్స్ చేస్తున్నారు. 2013లో ‘ఒంగోలు గిత్త’ తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్‌ సినిమా చేస్తున్నాడు.

కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేని టైం లో భాస్కర్ వంటి అవుట్ అఫ్ ది ఫామ్ దర్శకుడితో నటించడం అంటే సాహసం అనే అనుకోవాలి. దానితో ఈ సినిమా సక్సెస్ కావడం దర్శకుడికి కూడా చాలా ఇంపార్టెంట్. గీత ఆర్ట్స్ సంస్థకు చెందిన జీఏ2 పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.

గత కొంత కాలంగా ఈ సంస్థ హిట్లకు చిరునామాగా మారింది. ఈ సంస్థ భలే భలే మగాడివోయ్ తో నానికి, ప్రతి రోజూ పండగే తో సాయి ధరమ్ తేజ్ కు, గీత గోవిందంతో విజయ్ దేవరకొండకు తమ కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చింది. దీనితో అక్కినేని అభిమానులు ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

SBI Investigates Suspected Data Leak of 3.75 Lakh Records

The State Bank of India (SBI) is investigating a suspected data leak after around 3.75…

19 minutes ago

సుప్రీంకోర్టులో వైసీపీ తొలి ప్రయత్నం ఫలించింది.. తర్వాత?

స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధులను నామినేషన్స్‌ వేయనీయకుండా టీడీపి అడ్డుకుంటూ, ఏకగ్రీవాలు జరిపిస్తోందని కనుక ఈ ప్రక్రియపై స్టే…

41 minutes ago