Telugu

సుప్రీంకోర్టులో వైసీపీ తొలి ప్రయత్నం ఫలించింది.. తర్వాత?

స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధులను నామినేషన్స్‌ వేయనీయకుండా టీడీపి అడ్డుకుంటూ, ఏకగ్రీవాలు జరిపిస్తోందని కనుక ఈ ప్రక్రియపై స్టే విధించాలని కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది.

నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనంతో స్టే విధించలేదు. కానీ నామినేషన్స్‌ వేసేందుకు గడువు మరో 48 గంటలు పొడిగించాలని ఆదేశించింది.

ADVERTISEMENT

ఈ ప్రక్రియ పొడిగింపు కారణంగా ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించరాదని ఆదేశించింది. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు డీజీపీ అవసరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీం తీర్పు సిఎం చంద్రబాబు నాయుడుకు చెంపదెబ్బ అంటూ అప్పుడే వైసీపీ సొంత మీడియా తీర్మానించేసింది. అయితే తాము కోరినట్లు ఈ ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టు స్టే విధించలేదనే విషయం చెప్పడం లేదు.

ఇల్లలకాగానే పండుగ కాదన్నట్లు వైసీపీ అభ్యర్ధులు నామినేషన్స్‌ వేసినంత మాత్రాన్న గెలిచినట్లు కాదు కదా? పోటీ చేస్తున్న ప్రతీ స్థానంలో గెలిచినప్పుడే వైసీపీకి ప్రజాబలం ఉందని నిరూపించుకోగలుగుతుంది.

అప్పుడు కూటమి ప్రభుత్వమే తన బలాబలాలు, ప్రజాధరణ, రాజకీయ విధానాల గురించి పునరాలోచించుకోవాల్సి ఉంటుంది.

కానీ ఈ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినట్లయితే, ఓటమి భయంతోనే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎన్నికలు జరుగకుండా అడ్డుకునే ప్రయత్నించిందనే టీడీపి వాదనలు నిజమవుతాయి కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Chiranjeevi to Rajinikanth: Senior Heroes Lead the Way

For a change, it is the senior heroes who seem to be having the last…

16 minutes ago

అసెంబ్లీ ఎన్నికలకు ఇలాగే వెళ్తారా? ఏమైనా ఆలోచిస్తారా?

ఈ స్థానిక ఎన్నికలు టీడీపీ, జనసేనల గెలుపోటములకు కాక, వాటి ఐక్యతకు పరీక్షగా మారాయనిపిస్తుంది సోషల్ మీడియాలో జరుగుతున్న భీకర…

16 minutes ago