
ముప్పై అయిదేళ్ల క్రితం గీతాంజలి తీసినప్పుడు దాని గొప్పదనమంతా ప్రేక్షకులతో పాటు మీడియా మొత్తం మణిరత్నంకే ఆపాదించింది. నాగార్జున యాక్టర్ గా అప్పటికింకా పూర్తి స్థాయిలో ఋజువు చేసుకోలేదు. అసలు మాటలే లేకుండా పుష్ప విమానం చేసినప్పుడు కమల్ హాసన్ కన్నా ఎక్కువ హై లైట్ అయ్యింది సింగీతం శ్రీనివాసరావుగారే. జంధ్యాల గారి టైటిల్స్ విన్నప్పుడు ముందు ఆయన మొహం గుర్తొచ్చాకే హీరో ఎవరో ఫ్లాష్ అవుతుంది. ఇవన్నీ జమానా ఉదాహరణలు అనుకుంటే వర్తమానమూ చూద్దాం. అఆ క్రెడిట్ నితిన్ కన్నా ముందు త్రివిక్రమ్ కు చెందుతుంది. స్టార్ క్యాస్టింగే లేని జాతిరత్నాలు నలభై కోట్లు తేవడం వెనుక ఉన్నది అనుదీప్ అనే పెన్ పవర్
నటనలో బుడిబుడి అడుగులు వేస్తున్న వైష్ణవ్ తేజ్ తో ఉప్పెన రూపంలో వంద కోట్ల బొమ్మ ఇవ్వడం వెనుక ఉన్న బుచ్చిబాబు మేధస్సే ఏకంగా రామ్ చరణ్ నుంచి పిలుపు వచ్చేలా చేసింది. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీళ్ళకే ఇలా అనిపిస్తే మరి రాజమౌళి గురించి ఏకంగా పుస్తకమే రాయొచ్చు. ఎవరు ఔనన్నా కాదన్నా ఆర్ఆర్ఆర్ అనే అద్భుతం రాజమౌళి చేశాడు కాబట్టే అదీ రోజు ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసింది. జేమ్స్ క్యామరూన్ కావొచ్చు స్టీవెన్ స్పీల్బర్గ్ కావొచ్చు. అందరూ మెచ్చుకుంటున్నది దేశాల సరిహద్దులు దాటి గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పించే స్థాయిలో ఒక ఇండియన్ సినిమా తీయడం గురించి. ఇందులో డౌట్ లేదు
అంతే తప్ప జూనియర్ ఎన్టీఆర్ బాగా చేశాడనో రామ్ చరణ్ గొప్పగా నటించాడనో కాదు. అంతెందుకు అవతార్ ని విపరీతంగా అభిమానించే వాళ్ళు సైతం అందులో ఓ అయిదుగురు నటీనటుల పేర్లు ఠక్కున చెప్పమంటే తడబడతారు. క్యామరూన్ తాలూకు టేకింగ్ మేజిక్ అది. ట్రిపులార్ విషయంలో ఫారినర్స్ ఇదే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ జక్కన్నను ఆకాశానికెత్తుతున్నారు తప్పించి ఇక్కడ తారక్ చరణ్ ఫ్యాన్స్ మురిసిపోవడానికి బాధపడటానికి ఏమీ లేదు. జపాన్ నుంచి యుకె దాకా, నెట్ ఫ్లిక్స్ సిఈఓ నుంచి బాలీవుడ్ షారుఖ్ దాకా అందరూ ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారంటే అదంతా రాజమౌళి ప్రతిభే. ఆ తర్వాతే ఏదైనా ఎవరైనా
One of the high-profile weddings in South India is going to happen on November 21,…
Is Tabu set to surprise fans with a special glimpse this Dasara? According to the…