
ఇక అందరి చూపులు కొత్త సంవత్సరం వైపుకు మళ్లాయి. జనవరి 1వ తేదీన దాదాపు నాలుగు చిత్రాలు తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. రాంగోపాల్ వర్మ “కిల్లింగ్ వీరప్పన్,” రామ్ “నేను.. శైలజ…” చిత్రాలతో పాటు ‘అబ్బాయితో అమ్మాయి, చిత్రం భళారే విచిత్రం’ వంటి చిన్న చిత్రాలు ధియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ నాలుగు చిత్రాలలో ప్రేక్షకుల చూపులు ప్రధానంగా ‘నేను.. శైలజ.., కిల్లింగ్ వీరప్పన్’ చిత్రాల పైనే ఉన్నాయి.
మరి 2016 ఏడాదిలో తొలి హిట్ అందుకునేది ఎవరు అన్న ఆసక్తి ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ కలుగుతోంది. అయితే ఈ సారి రామ్ “నేను.. శైలజ…” ద్వారా ఖచ్చితంగా హిట్ అందుకుంటాడనే నమ్మకం సినీ ప్రేక్షకులు వ్యక్తపరుస్తున్నారు. అలాగే వర్మ చివరి చిత్రంగా ‘కిల్లింగ్ వీరప్పన్’పై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో తొలి హిట్ అందుకునే జాబితాలో ‘కిల్లింగ్ వీరప్పన్’ కూడా ఉంది.
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…