
ఈ కేసులో మరో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 12న కడప జైలులో విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది.
ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందామూ లేదని ఎంపీ అవినాష్ రెడ్డి వాదిస్తున్నప్పటికీ, ఆయనే వివేకాను అడ్డుతొలగించుకోవడానికి మిగిలిన నిందితులతో కలిసి ఈ కుట్రను అమలుచేశారని సీబీఐ స్పష్టంగా చెపుతోంది. దానికి అవసరమైన అన్ని బలమైన సాక్ష్యాధారాలను కూడా కోర్టుకి సమర్పించింది. కనుక అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం అనివార్యంగానే కనిపిస్తోంది. ఈ విషయం ఆయన కూడా గ్రహించిన్నట్లే ఉన్నారు కనుకనే చివరి ప్రయత్నంగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన్నట్లు భావించవచ్చు. కానీ దీంతో ఆయనే స్వయంగా సీబీఐకి తనను అరెస్ట్ చేయవచ్చనే సూచన ఇచ్చిన్నట్లయ్యింది. ఒకవేళ ఆయన పిటిషన్ను హైకోర్టు తిరస్కరిస్తే అప్పుడు సీబీఐ తప్పకుండా అరెస్ట్ చేయవచ్చు.
The Narendra Modi government is facing fresh challenges in pushing forward its major reforms. Plans…
Bigg Boss Telugu Season 10 gameplay has reached an entirely new level. Everything was good…