
అయితే ముమైత్ సిగరెట్ తాగే విషయమై ఇప్పటికే ప్రేక్షకులకు ఓ స్పష్టత వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లో తొలి రోజున సిగరెట్ తాగే రూమ్ లోకి సమీర్, ధన్ రాజ్ తదితరులతో పాటు ముమైత్ కూడా వెళ్లి స్మోక్ చేసిన వీడియోలు టీవీలలో ప్రసారం అయ్యాయి. సాధారణంగా హీరోయిన్లు సినీ సన్నివేశాలలో మాత్రమే ఇలా ‘స్మోక్’ చేస్తారనే అభిప్రాయం ప్రేక్షకులకు ఉండేది. కానీ అది కాదు అసలు వాస్తవం అంటూ తన అసలు రూపాన్ని ‘బిగ్ బాస్’ షో ద్వారానే చెప్పింది ముమైత్.
సిట్ విచారణ ముగిసిన నేపధ్యంలో మళ్ళీ ‘బిగ్ బాస్’ హౌస్ లో ముమైత్ కనపడుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. చట్టపరమైన ఇబ్బందుల రీత్యా ఈ హౌస్ లో ఉండడానికి వీల్లేదని చెప్పిన ‘బిగ్ బాస్’ మళ్ళీ ముమైత్ కు ఎంట్రీ ఇస్తారా? అనేది వేచిచూడాలి. ముమైత్ హౌస్ ను వీడిన సందర్భంలో మాత్రం… హౌస్ లో ఉన్న కత్తి కార్తీక, ధన్ రాజ్, హరితేజ వంటి వారు కన్నీటి పర్యంతం అవుతూ సెంటిమెంట్ సీన్ ను పండించాలనే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…