Telugu

ముంబై “ప్లే ఆఫ్స్” ఆశలు ఆవిరి!

2016 ఐపీఎల్ సీజన్ నుండి దాదాపుగా ముంబై ఇండియన్స్ జట్టు తప్పుకున్నట్టే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్ కు అర్హత పొందే అవకాశం లేదు. ఆడిన 12 మ్యాచ్ లలో 12 పాయింట్లు సాధించి పర్వాలేదనిపించే స్టేజ్ లో ఉన్న ముంబై జట్టు, మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ కు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం… దారుణ పరాజయాలతో మిగిలిన జట్లతో పోలిస్తే నెట్ రన్ రేట్ లో ముంబై జట్టు బాగా వెనుకబడి ఉంది.

పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ జట్టుతో పోటీపడ్డ ముంబై, కనీస పోరాట పటిమను కూడా ప్రదర్శించలేక చేతులెత్తేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై పేలవమైన బ్యాటింగ్ ప్రతిభతో కేవలం 124 పరుగులను మాత్రమే నమోదు చేసి మ్యాచ్ ను వన్ సైడ్ చేసేసింది. జట్టులో ఉన్న 11 మందిలో కనీసం ఒక్కరు కూడా 30 పరుగులకు చేరుకోలేక పోయారంటే ముంబై జట్టు ఏ విధంగా రాణించిందో అర్ధం చేసుకోవచ్చు.

ADVERTISEMENT

స్వల్ప లక్ష్య చేధనలో తొలి ఓవర్లోనే ఒక వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ జట్టు ఎలాంటి ట్విస్ట్ లకు అవకాశం ఇవ్వకుండా మురళీ విజయ్, సాహాల అర్ధ సెంచరీలతో విజయాన్ని అవలీలగా అందుకుంది. ఈ గెలుపు వలన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు పాయింట్ల పరంగా పెద్దగా లాభించింది ఏమీ లేకపోయినా, ఇప్పటికే టోర్నీ నుండి అవుటైన పంజాబ్, తనతో పాటు ముంబై ను కూడా పట్టికెళ్ళినట్లయ్యింది.

Share
Published by

Recent Posts

Pics: Amiksha Sizzles In Olive Green Saree Look

Amiksha Pawar is setting the internet ablaze with her latest sartorial statement, redefining modern ethnic…

26 minutes ago

ఇది ఖచ్చితంగా రాజకీయ ఆత్మహత్యే కదా?

రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవనే మాట తరచూ వినబడుతూ ఉంటుంది. తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ పదవి…

41 minutes ago