
రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవనే మాట తరచూ వినబడుతూ ఉంటుంది. తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ పదవి ఊడటంతో అది మరోసారి నిరూపించబడింది.
ఆమెకు సిఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చాలా ప్రాధాన్యమే ఇచ్చారు. అభివృద్ధి పనులలో చిలక కొట్టుళ్ళు ఉంటాయని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. కనుక మిగిలిన మంత్రుల్లా బుద్ధిగా పని చేసుకుంటే నేడు ఈ దుస్థితి కలిగేదే కాదు.
కానీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, తరచూ వివాదాలలో చిక్కుకుంటున్నారు. అక్కినేని నాగార్జున, కేటీఆర్‌లపై నోరు జారినందుకు వారు ఆమెపై చెరో వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు. అప్పుడు ఆ కేసుల నుంచి ఆమెను ఎవరు కాపాడారో ఆమెకే బాగా తెలుసు.
ఇక ఆమె కూతురు సుస్మిత బహుశః బీఆర్ఎస్ పార్టీ ప్రభావానికి లోనయ్యి తన తండ్రికి ఎమ్మెల్సీ ఇవ్వలేదంటూ మొదలుపెట్టి, సిఎం రేవంత్ రెడ్డి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడారు.
కొండా కుటుంబం రోడ్డున పడటానికి మరో ముఖ్య కారణం కనిపిస్తోంది. వారు బహుశః బిజేపి, బీఆర్ఎస్ పార్టీలను నమ్ముకొని రెచ్చిపోయినట్లున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఎపిసోడ్ ముగియగానే, ఆ రెండు పార్టీలు వారికి తలుపులు మూసేశాయి!
బిజేపి నేత మురళీధర్ రావు సోషల్ మీడియాలో కొండా సురేఖ ఫోటో వేసి ‘మా పార్టీ డస్ట్ బిన్ కాదు’ అని చెప్పేశారు. రాజకీయాలలో ఈ స్థాయికి కొండా కుటుంబానికి ఇది మరో దారుణమైన అవమానమే కదా?
అంటే కొండా కుటుంబం బహుశః ఇతర పార్టీల రాజకీయ ఉచ్చులో చిక్కుకొని రోడ్డున పడ్డారు తప్ప కాంగ్రెస్ పార్టీ వలన కాదనిపిస్తుంది.
కొండా మురళి మీడియా ముందుకు వచ్చి మీసం తిప్పగా, మంత్రి పదవిలో ఉన్న సురేఖ, సిఎం రేవంత్ రెడ్డిపై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా వాటితో తనకు సంబంధం లేదన్నారు. ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో మరో సిఎం పేరు వస్తుందని సుస్మిత అన్నారు. ఇవన్నీ వారి పాలిట రాజకీయ ఆత్మహత్యగా మారాయి.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు, సుస్మిత తన తండ్రికి ఎమ్మెల్సీ, తనకు ఎమ్మెల్యే టికెట్టు ఆశించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తల్లి మంత్రి పదవి ఊడింది. కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ మూడు పార్టీలు తలుపులు మూసేశాయి. రాజకీయ ఆత్మహత్య అంటే ఇదే కదా?
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.
ఎందుకంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు… ఆత్మహత్యలే ఉంటాయి.
రోజులు మారిపోయాయి…“మా అంత మొనగాడు లేడు, పార్టీ మీద ఆధారపడకుండా సొంతంగా గెలిచాం, ఇండిపెండెంట్గా నిలబడినా గెలుస్తాం” అనే అహంకారం ప్రస్తుత రాజకీయాల్లో పనిచేయదు… https://t.co/xBw232E7c1 pic.twitter.com/hNkiyTkVvy
— 🃏☸ Viśva Naruḍu ☸🃏 (@Dollar_567) September 5, 2026
Maadhav Bhupathiraju, nephew of Ravi Teja, is debuting as a leading man with Maremma. The…
Amiksha Pawar is setting the internet ablaze with her latest sartorial statement, redefining modern ethnic…