
ఈ బాధ్యతలను చంద్రబాబు తన కేబినెట్ లోని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుల భుజస్కందాలపై పెట్టారు. దీంతో నేటి ఉదయమే ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారిద్దరూ రాజధాని ప్రాంతంలోని ఐనవోలులో వాలిపోయి, అక్కడి గ్రామస్థులతో వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భూములిచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని, ఇచ్చిన హామీ మేరకు అన్నింటినీ అందజేస్తామని వారు రైతులకు నచ్చజెబుతున్నారు. తమ వద్దకే వచ్చి తమ సందేహాలను నివృత్తి చేస్తున్న మంత్రుల మాటలను రైతులు ఆసక్తిగా ఆలకిస్తున్నారు.
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…
Priya Bhavani Shankar is taking the internet by storm with her latest indoor photoshoot, proving…