సినీ ఇండస్ట్రీలో పుకార్లకు కొదవుండదు. హీరోయిన్ల ఎఫైర్ల నుండి అగ్ర హీరోల సినిమాల వరకు ప్రతీది సినీ ప్రేక్షకులకు ఆసక్తికరమైన విషయమే. ఆ కోవలోనే ప్రిన్స్ మహేష్ బాబు – మురుగదాస్ సినిమాపై పలు రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాలో మహేష్ ‘డ్యూయల్’ రూల్ చేస్తున్నారని వచ్చిన వార్తలను ఇటీవల దర్శకుడు ఖండించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమా కధపై మరో వార్త వినపడింది. గతంలో అజిత్ హీరోగా మురుగదాస్ ఓ చిత్రాన్ని తీయాలని కధ వినిపించగా, అది సెట్స్ వరకు దారి తీయలేదు. అయితే అదే కధను మహేష్ చేత మురుగదాస్ ఓకే చేయించుకున్నారని సినీవర్గాల్లో హల్చల్ చేసిన సమాచారం.
దీనిపై ట్రేడ్ వర్గీయులు అడిగిన ఓ ప్రశ్నకు మురుగదాస్ జవాబిచ్చారు. “మహేష్ తో తెరకెక్కిస్తున్న సినిమా కధ ఫ్రెష్” అని చెప్పి పుకార్లకు తెరదించారు. ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేసారని తెలుస్తోంది.





